స్నానానికి వెళ్లిన 17 ఏళ్ల కుర్రాడు.. అరగంట దాటడంతో ఎన్నిసార్లు పిలిచినా నో రెస్పాన్స్.. తలుపులు పగలగొట్టి చూస్తే..

ABN , First Publish Date - 2022-02-12T22:31:04+05:30 IST

స్కూల్‌కు టైం అవుతుండటంతో 17ఏళ్ల కుర్రాడు స్నానానికని బాత్‌రూమ్‌కు వెళ్లాడు. అరగంట దాటినా బాత్‌రూమ్ నుంచి బయటకు రాలేదు. దీంతో అతడి సోదరుడు కేకలు వేశాడు. అయినా లోపల నుంచి ఉలుకూప

స్నానానికి వెళ్లిన 17 ఏళ్ల కుర్రాడు.. అరగంట దాటడంతో ఎన్నిసార్లు పిలిచినా నో రెస్పాన్స్.. తలుపులు పగలగొట్టి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: స్కూల్‌కు టైం అవుతుండటంతో 17ఏళ్ల కుర్రాడు స్నానానికని బాత్‌రూమ్‌కు వెళ్లాడు. అరగంట దాటినా బాత్‌రూమ్ నుంచి బయటకు రాలేదు. దీంతో అతడి సోదరుడు కేకలు వేశాడు. అయినా లోపల నుంచి ఉలుకూపలుకూ లేదు. ఈ క్రమంలో తలుపులు పగలగొట్టి చూసి, కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


హర్యానాలోని పానిపట్ ప్రాంతానికి చెందిన విజయ్‌కి సచిన్, పరాస్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. పరాస్‌కు ప్రస్తుతం 17ఏళ్లు కాగా.. అతడు స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఎప్పటిలాగే ఉదయాన్నే నిద్రలేచిన పరాస్.. స్కూల్‌ టైం కావొస్తుండటంతో 8.30 గంటలకు స్నానానికని బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. స్నానానికని వెళ్లిన పరాస్.. అరగంట దాటినా బయటకు రాలేదు. దీంతో సచిన్.. పరాస్‌ను పిలిచి తొందరగా బయటకు రావాల్సిందిగా కోరాడు.



అయితే ఎంతసేపు పిలిచినా లోపల నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతో సచిన్ బాత్‌రూమ్ తలుపులు పగలగొట్టొడు. ఈ క్రమంలో గ్యాస్ గీజర్‌ నుంచి వెలువడ్డ విషవాయువుల కారణంగా బాత్‌రూమ్‌లో పడిపోయి ఉన్న పరాస్‌ను చూసి కుటుంబ సభ్యులు షాకయ్యారు. అనంతరం పరాస్‌ను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పరాస్‌ను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే అతడు చనిపోయినట్టు వెల్లడించారు. దీంతో అతడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తన మరో కుమారుడు కూడా రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడని విజయ్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశాడు.




Updated Date - 2022-02-12T22:31:04+05:30 IST