17000 కీలకం

ABN , First Publish Date - 2022-10-03T08:39:39+05:30 IST

నిఫ్టీ గత వారం మానసిక అవధి 17000 కన్నా దిగజారినా శుక్రవారం బలమైన రికవరీ సాఽ దించి ఆ ఒక్క రోజే 275 పాయిం ట్లు లాభపడి ఆ స్థాయి కన్నా స్వల్పంగా పైన ముగిసింది.

17000 కీలకం

సోమవారం స్థాయిలు

నిరోధం : 17130, 17200

మద్దతు : 16950, 16900


నిఫ్టీ గత వారం మానసిక అవధి 17000 కన్నా దిగజారినా శుక్రవారం బలమైన రికవరీ సాఽ దించి ఆ ఒక్క రోజే 275 పాయిం ట్లు లాభపడి ఆ స్థాయి కన్నా స్వల్పంగా పైన ముగిసింది. వీక్లీ చార్టుల్లో కూడా వారం గరిష్ఠ స్థాయిలకు సమీపంలో క్లోజయింది. అయి నా గత వారం స్థాయి కన్నా 230 దిగువనే ముగిసింది. టెక్నికల్‌గా ప్రధాన ట్రెండ్‌లో ఎలాంటి మార్పు లేదు. గత వారం ఏర్పడింది టెక్నికల్‌ పుల్‌బ్యాక్‌ మాత్రమే. ట్రెండ్‌లో సానుకూలతను ధ్రువీకరించాలంటే రెండో వారంలో కూడా ఈ స్థాయికి పైన కన్సాలిడేట్‌ కావాలి. అయితే అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లలో శుక్రవారం నాటి ధోరణిని బట్టి చూస్తే ఈ వారం మన మార్కెట్‌ కూడా రియాక్షన్‌లో ప్రారంభం కావచ్చు. 17000 వద్ద మరో పరీక్ష ఎదుర్కొనే ఆస్కారం ఉంది. 

బుల్లిష్‌ స్థాయిలు: రియాక్షన్‌లో పడినా స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం 17000 వద్ద మద్దతు తీసుకుని తీరాలి. ప్రధాన నిరోధ స్థాయిలు 17200, 17350. ఈ స్థాయిల కన్నా పైన నిలదొక్కుకుంటే మరో ప్రధాన నిరోధం 17500. 

బేరిష్‌ స్థాయిలు: 17000 వద్ద నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 16800. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక బలహీనత మరింతగా ఉంటుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 16450. 

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ కూడా గత వారం బలమైన రియాక్షన్‌లో ప్రారంభమై 1000 పాయింట్ల మేరకు దిగజారినా శుక్రవారం బలమైన రికవరీ సాధించింది. అయినా 1000 పాయింట్లు నష్టంతో ముగిసింది. ప్రధాన మద్దతు స్థాయి 38000. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. ప్రధాన నిరోధం 39300. అంతకన్నా పైన నిలదొక్కుకుంటే ట్రెండ్‌ సానుకూలం అవుతుంది.

పాటర్న్‌: నిఫ్టీ ఇప్పుడు 17200 వద్ద ‘‘ఏటవాలుగా దిగువకు ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. సానుకూలత కోసం 16800 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిలదొక్కుకోవాలి. గత వారం మార్కెట్‌ 50 డిఎంఏ కన్నా స్వల్పంగా దిగజారింది. ఇక్కడ రికవరీ తప్పనిసరి. మార్కెట్‌ ఇప్పుడు 100, 200 డిఎంఏల వద్ద పరీక్ష .

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్‌ రివ ర్సల్‌ ఉండవచ్చు.

Updated Date - 2022-10-03T08:39:39+05:30 IST