172 మెమోను సవరించాలి

Jun 20 2021 @ 00:16AM
పొందూరు ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేస్తున్న ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు

పొందూరు: నూతన జాతీయ విద్యా విధానం- 2020 అమలులో భాగంగా    జారీచేసిన 172 మెమోను సవరించాలని ఏపీటీఎఫ్‌ నాయకులు ఎంపీడీవో మురళీ, తహసీల్దార్‌ ఆర్‌.రంజిత్‌కుమార్‌కు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలోఏపీటీఎఫ్‌ మండల ప్రధానకా ర్యదర్శి అల్లంశెట్టి రవికుమార్‌, మండలాధ్యక్షుడు వండాన అప్పన్న, జిల్లా ఉపాధ్యక్షుడు బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఫసోంపేట: ఎల్‌కేజీనుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలోనే  కొనసాగించాలని ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు కోరారు.శనివారం సోంపేట మండలపరిషత్‌ కార్యాలయంలో  నూతన విద్యావిధానంపై  వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ నాయకులు పి.కూర్మారావు,  జి.వాసుదేవ్‌, ఏపీ మురళి  పాల్గొన్నారు. 


 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.