డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్.. ఏకంగా 172 మంది ఓకే తరహా సమాధానాలు రాయడంతో షాకైన టీచర్లు

ABN , First Publish Date - 2022-05-01T07:35:43+05:30 IST

గుజరాత్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో గతేడాది నిర్వహించిన పరీక్షలో జరిగిన గోల్‌మాల్ తాజాగా బయటపడింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 172 మంది కాపీయింగ్‌కు పాల్పడినట్టు యూనివర్సిటీ సిబ్బంది గుర్తించారు. వారందరి సమాధానాలు చిన్న అక్షరం కూడా మారకుండా ఒకేలా ఉండడంతో టీచర్లు షాకయ్యారు...

డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్.. ఏకంగా 172 మంది ఓకే తరహా సమాధానాలు రాయడంతో షాకైన టీచర్లు

గుజరాత్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో గతేడాది నిర్వహించిన పరీక్షలో జరిగిన గోల్‌మాల్ తాజాగా బయటపడింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 172 మంది కాపీయింగ్‌కు పాల్పడినట్టు యూనివర్సిటీ సిబ్బంది గుర్తించారు. వారందరి సమాధానాలు చిన్న అక్షరం కూడా మారకుండా ఒకేలా ఉండడంతో టీచర్లు షాకయ్యారు. ఆ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం విచారణకు ఆదేశించింది. 


గుజరాత్‌లోని పటాన్‌లోని హేమచంద్రాచార్య నార్త్ గుజరాత్ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో 2021 సంవత్సరం బీఎస్సీ వివిధ సెమిస్టర్‌ల పరీక్షలు డిసెంబర్ నెలలో జరిగాయి. బీఎస్సీ కెమిస్ట్రీ ఐదో సెమిస్టర్ పరీక్షలో 172 మంది విద్యార్థుల జవాబు పత్రాలు ఒకే రకంగా ఉండడం ఉపాధ్యాయులను విస్మయానికి గురి చేసింది. ఈ విద్యార్థులందరూ పరీక్ష హాలులో టెక్ట్స్ బుక్స్ చూసి కాపీ కొట్టినట్టు తేలింది. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. 


పరీక్ష సమయంలో జూనియర్ సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, అబ్జర్వర్ ఉంటారు. పరీక్షా గదుల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినా కాపీయింగ్ చేస్తున్న వారిని పట్టుకోలేకపోయారు. ఆ విద్యార్థులు పరీక్ష రాసిన సెంటర్లో పని చేసిన సిబ్బందిని యూనివర్సిటీ యాజమాన్యం విచారణ చేయ నుంది. ఆ ఘటనపై ఎలాంటి చర్య తీసుకోవాలో త్వరలోనే నిర్ణయించనున్నట్టు యూనివర్సిటీ తెలిపింది. 


Updated Date - 2022-05-01T07:35:43+05:30 IST