18 జిల్లాల్లో Covid కేసులు నిల్‌

ABN , First Publish Date - 2022-03-19T17:14:28+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం మరింత తగ్గుముఖం పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 106 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 18 జిల్లాల్లో ఒక కేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరు

18 జిల్లాల్లో Covid కేసులు నిల్‌

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం మరింత తగ్గుముఖం పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 106 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 18 జిల్లాల్లో ఒక కేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరులో 84 మంది కాగా దక్షిణకన్నడ జిల్లాలో ఆరుగురు, మిగిలిన పది జిల్లాలో 10 మంది లోపు బాధితులు నమోదయ్యారు. 154 మంది కోలుకోగా ఐదుగురు మృతి చెందారు. వీరిలో బెంగళూరులో ఇద్దరు కాగా మిగిలిన మూడు జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2013 మంది చికిత్సలు పొందుతున్నారు. వీరిలో బెంగళూరులోనే 1714 మంది ఉన్నారు.

Updated Date - 2022-03-19T17:14:28+05:30 IST