ltrScrptTheme3

'18 పేజెస్': షూటింగ్ రీ స్టార్ట్

Oct 27 2021 @ 11:36AM

యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ '18 పేజెస్'. ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో అల్లు అరవింద్, సుకుమార్‌ల సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా వేవ్స్ కారణంగా షూటింగ్ దశలోనే నిలిచిపోయింది. ఆమధ్య పూర్తైన టాకీ పార్ట్ వరకు డబ్బింగ్ చెబుతున్నట్టు హీరో నిఖిల్ తెలిపాడు. అయితే, మళ్ళీ ఇప్పుడు ఈ మూవీ బ్యాలెన్స్ షూటింగ్ జరిపేందుకు చిత్రబృం షూటింగ్ ప్రారంభించింది. 10 రోజులు చిత్రీకరణ జరిపితే మూవీ షూటింగ్ పూర్తవుతుందట. డిసెంబర్ వరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలున్నాయట. కాగా నిఖిల్ ఈ సినిమాతో పాటు చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2' అలాగే మరో రెండు సినిమాలలోనూ నటిస్తున్నాడు. ఈ నాలుగు సినిమాల షూటింగ్స్‌లో సమాంతరంగా పాల్గొంటున్నాడు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.