
New Delhi : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,819 కరోనా కేసులు(Corona cases) నమోదయ్యాయి. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 30 మంది మరణించారు. కరోనా నుంచి మరో 13,827 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,04,555కు పెరిగింది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.16 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకూ 197.61 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.