ఇంట్లో ఉన్న కూతురి గురించి బయటి వ్యక్తుల నుంచి ఫోన్.. ఆస్పత్రిలో చేర్చామని సమాచారం.. అనుమానంతో ఆమె గదిలోకి వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-10-08T01:01:21+05:30 IST

అప్పటి వరకూ తమ కళ్ల ముందే ఉండి.. అప్పుడే తన గదిలోకి వెళ్లిన కూతురి గురించి బయటి వ్యక్తుల నుంచి ఫోన్ రావడంతో ఆ తల్లిదండ్రులు షాకయ్యారు. తమ కూతురిని ఆసుపత్రిలో చేర్చినట్లు సదరు వ్యక్తులు చెప్పడంతో కంగుతిన్నారు. ‘ఇదేంటి ఇప్పటి వరకూ మాతో మాట్లాడి

ఇంట్లో ఉన్న కూతురి గురించి బయటి వ్యక్తుల నుంచి ఫోన్.. ఆస్పత్రిలో చేర్చామని సమాచారం.. అనుమానంతో ఆమె గదిలోకి వెళ్లి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: అప్పటి వరకూ తమ కళ్ల ముందే ఉండి.. అప్పుడే తన గదిలోకి వెళ్లిన కూతురి గురించి బయటి వ్యక్తుల నుంచి ఫోన్ రావడంతో ఆ తల్లిదండ్రులు షాకయ్యారు. తమ కూతురిని ఆసుపత్రిలో చేర్చినట్లు సదరు వ్యక్తులు చెప్పడంతో కంగుతిన్నారు. ‘ఇదేంటి ఇప్పటి వరకూ మాతో మాట్లాడి ఇప్పడే మా కూతురు తన గదిలోకి వెళ్లిదండి’ ఆమెను మీరు ఆసుపత్రిలో చేర్చడం ఏంటి అంటూ సదరు వ్యక్తులతో ఆ తల్లిదండ్రులు వాదించారు. అయితే అవతలి వాళ్లు బలంగా చెప్పడంతో.. వారి మనసు ఏదో కీడు శంకించింది. ఈ క్రమంలోనే ఫోన్ పెట్టేసి.. కూతురి గదిలోకి వెళ్లి చూశారు. అక్కడ ఆమె కనిపించకపోవడంతో విస్తుపోయారు. అనంతరం ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఆసుపత్రికి వెళ్లిన ఘటన చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. 



రాయ్‌పూర్‌లోని కచనా ప్రాంతంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో రేష్మా బానూ అనే 19ఏళ్ల యువతి తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తుంది. ఇదే ప్రాంతానికి చెందిన అర్బాజ్ అనే వ్యక్తితో కొద్ది కాలం క్రితం రేష్మా ప్రేమలో పడింది. ఈ విషయం రేష్మా కుటంబ సభ్యుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు రేష్మాను మందలించారు. అర్బాజ్‌ను కలవకూడదు, మాట్లాడకూడదు అని ఆంక్షలు విధించారు. ఈ సంగతి అర్బాజ్‌కు తెలియడంతో రేష్మాతో వాదనకు దిగాడు. ఈ క్రమంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో రేష్మా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. బుధవారం సాయంత్రం భవనం 5వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బిల్డింగ్ మీద నుంచి దూకిన రేష్మాను.. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే రేష్మాను పరీక్షించిన వైద్యులు.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు స్పష్టం చేశారు. కాగా.. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా స్థానికులు రేష్మా తల్లిదండ్రులకు తెలియజేయగా.. మొదటగా వాళ్లు నమ్మలేదు. తమ కూతురు ఇంట్లోనే ఉందని వాదించారు. ఆ తర్వాత తమ కూతురు తన గదిలో లేదని గుర్తించి.. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. 



ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భాగంగా రేష్మ గదిని పరిశీలించారు. అక్కడ ‘నా మృతికి ఎవరూ కారణం కాదు’ అని ఉన్న సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. కాగా.. రేష్మ నిజంగా ఆత్మహత్యకు పాల్పడిందా.. లేక ఆమెను బిల్డింగ్‌పై నుంచి ఎవరైనా తోసేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోపక్క రేష్మా లవర్ అర్బాజ్ కనబడకుండా పోవడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. 


Updated Date - 2021-10-08T01:01:21+05:30 IST