ఈ యువతికి 19 ఏళ్ల వయసు.. లగ్జరీ బైకులపై షికార్లు.. ఇప్పుడు పోలీసుల అదుపులో.. ఇంతకీ ఈమె కథేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-21T20:28:25+05:30 IST

ఆమె వయసు 19ఏళ్లు. చూడటానికి చక్కగా ఉంటుంది. కానీ ఆమె చేసే పనులు తెలిస్తే ఒంట్లో వణుకు పుట్టడం ఖాయం. లగ్జరీ బైకులపై షికార్లు కొట్టే ఈ యువతిని పట్టుకోవడానికి పోలీసులకు రెండున్నర నెలల సమ

ఈ యువతికి 19 ఏళ్ల వయసు.. లగ్జరీ బైకులపై షికార్లు.. ఇప్పుడు పోలీసుల అదుపులో.. ఇంతకీ ఈమె కథేంటో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఆమె వయసు 19ఏళ్లు. చూడటానికి చక్కగా ఉంటుంది. కానీ ఆమె చేసే పనులు తెలిస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. లగ్జరీ బైకులపై షికార్లు కొట్టే ఈ యువతిని పట్టుకోవడానికి పోలీసులకు రెండున్నర నెలల సమయం పట్టింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఈ యువతికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని కరౌలీ ప్రాంతానికి చెందిన రేఖా మీనా.. చిన్నతనంలో తల్లిని కోల్పోయింది. దీంతో తండ్రి ఆమెను అల్లారు ముద్దుగా పెంచాడు. కూతురు భవిష్యత్తు బాగుండాలని స్థానికంగా ఉన్న ఓ ప్రముఖ పాఠశాలలో చేర్పించాడు. కానీ ఆమె మాత్రం తండ్రి కోరుకున్న విధంగా చదువులో రాణించలేదు. గుట్టుగా తప్పుడు మార్గాన్ని ఎంచుకుని.. నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టింది. లేడీ డాన్‌గా అవతరించింది. తుపాకిని చేతులో పట్టుకుని బాలీవుడ్ పాటలకు రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఎంతో మంది ఆకర్షితులయ్యారు. 



రేఖా మీనాకు అనుచరులుగా మారారు. ఈ క్రమంలో ఆమె సెటిల్మెంట్లు చేయడం ప్రారంభించింది. సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుతో లగ్జరీ కార్లు, బైకులు కొనుగోలు చేసి, వాటిపై లాంగ్ డ్రైవ్‌కు వెళ్తూ ఎంజాయ్ చేసేది. అయితే రెండు నెలల క్రితం జరిగిన ఓ సంఘటనతో ఈ యువతి ప్రస్తుతం కటకటాలపాలైంది. సెటిల్మెంట్‌లో భాగంగా సెప్టెంబర్ 28న రేఖా మీనా అనుచరులు ఓ వ్యక్తిపై దాడి చేశారు. అతడిపై కాల్పులు జరపడమే కాకుండా.. కుటుంబ సభ్యులను చితక్కొట్టారు. ఈ ఘటన అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో రేఖా మీనాపై పోలీసులు ఫోకస్ పెట్టారు. రెండున్నర నెలలపాటు ఆమె కోసం తీవ్రంగా గాలించి.. ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఆమె దగ్గర నుంచి సుమారు 15 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. రేఖా మీనాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన అధికారులు.. ఆమెను కోర్టులో హాజరుపర్చనున్నారు. 




Updated Date - 2022-01-21T20:28:25+05:30 IST