19ఏళ్ల కుర్రాడు.. 3ఏళ్లుగా అమ్మాయితో ప్రేమాయణం.. ఎవ్వరికీ చెప్పకుండా ఓ చోటుకు రమ్మని.. Googleలో చూసి మరీ..

ABN , First Publish Date - 2021-11-04T21:12:42+05:30 IST

అతడి సుమారు 19ఏళ్ల వయసు ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ప్రేమిస్తున్నానంటూ మనసులో మాటను బయటపెట్టాడు. అతడి మాటలకు కరిగిపోయిన ఆ అమ్మాయి అతడితో ప్రే

19ఏళ్ల కుర్రాడు.. 3ఏళ్లుగా అమ్మాయితో ప్రేమాయణం.. ఎవ్వరికీ చెప్పకుండా ఓ చోటుకు రమ్మని.. Googleలో చూసి మరీ..

ఇంటర్నెట్ డెస్క్: అతడి సుమారు 19ఏళ్ల వయసు ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ప్రేమిస్తున్నానంటూ మనసులో మాటను బయటపెట్టాడు. అతడి మాటలకు కరిగిపోయిన ఆ అమ్మాయి అతడితో ప్రేమలో పడింది. దీంతో మూడేళ్లుగా వాళ్లు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ అమ్మాయిని ఓ ప్రదేశానికి పిలిచాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 


రాజస్థాన్‌కు చెందిన విక్రమ్‌(19) స్థానికంగా ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ వచ్చే డబ్బులను సరదాల కోసం వెచ్చించేవాడు. ఈ క్రమంలోనే అతడు 12ఏళ్ల అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ప్రేమిస్తున్నాను అని వెంటపడటంతో.. తెలిసీ తెలియని వయసులో ఆ అమ్మాయి కూడా విక్రమ్‌ను ఇష్టపడింది. దీంతో వీరిద్దరూ మూడేళ్లుగా చెట్టాపట్టాలేసుకుని ప్రేమలో మునిగితేలారు. ఉన్నట్టుండి కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. చీటికి మాటికి గొడవల జరుగుతుండటం విక్రమ్‌కు నచ్చలేదు. దీంతో నవంబర్ 1న ఆమెను మారుమూల ప్రదేశంలో ఉన్న వాటర్ ట్యాంక్ మీదకు తీసుకెళ్లాడు. 



అక్కడ కూడా వారిద్దిరి మధ్య ఓ చిన్న విషయంలో గొడవ జరిగింది. దీంతో విక్రమ్ దారుణానికి పాల్పడ్డాడు. పదునైన బండరాయితో ఆ అమ్మాయిని హత్య చేశాడు. అనంతరం శవాన్ని కింద పడేసి, తానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా సీన్ క్రియేట్ చేయబోయాడు. అయితే పోలీసుల విచారణలో అతడి బండారం బయటపడింది. విక్రమే హత్య చేసినట్టు పోలీసులు తేల్చేశారు. అంతేకాకుండా ఆమెను హత్య చేయడం కోసం విక్రమ్ కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తున్నట్టు పోలీసులు విచారణలో తేలింది. పోలీసుల చేతికి చిక్కకుండా హత్య చేయడం ఎలా అనే అంశంపై విక్రమ్ గూగుల్‌లో సెర్చ్ చేసినట్టు అతడి ఫోన్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా అతడిపై కేసు నమోదు చేసి, జైలుకు తరలించారు. 




Updated Date - 2021-11-04T21:12:42+05:30 IST