ఇద్దరు దళిత యువకుల దారుణ హత్య

ABN , First Publish Date - 2022-04-23T23:46:35+05:30 IST

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు దళిత యువకులను చిత్రహింసలు పెట్టి చంపడం..

ఇద్దరు దళిత యువకుల దారుణ హత్య

బెంగళూరు: కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు దళిత యువకులను చిత్రహింసలు పెట్టి చంపడం సంచలనమైంది. ఇద్దరి మృతదేహాలు శుక్రవారంనాడు ఒక చెరువులో తేలాయి. దీనిపై ప్రాథమిక దర్యాప్తు జరిపామని, వారిని చిత్రహింసలు పెట్టిన చంపడానికి దారితీసిన కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల ప్రమేయం ఉందని వారు అనుమానిస్తున్నారు. డిప్యూటీ సూపరింటెండ్ అఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి సారథ్యంలోని పోలీసులు టీమ్‌లు నిందితుల కోసం జల్లెడ పడుతున్నాయి.


కాగా, మృతులను పెద్దనహళ్లి గ్రామానికి చెందిన గిరీష్ ముదలగిరప్ప (30), గిరీష్ (32)గా పోలీసులు గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం, నిందితులలో ఒకడైన నందీష్ ఈ ఇద్దరు దళిత యువకులకు ఇంటికి వెళ్లి వారిని ఒప్పించి తనతో పాటు ఒక చోటుకు తీసుకు వెళ్లాడు. అప్పటికే అప్పటికి చేరుకున్న నందీష్ మిత్రులు ఈ ఇద్దరు యువకులపై దాడి చేశారు. వారి కాళ్ల కింద ఎండుటాకులు పోగుచేసి నిప్పుపెట్టారు. మంటకు తాళలేక ముదలగిరప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. గిరీష్ తప్పించుకునే ప్రయత్నం చేయగా అతన్ని పట్టుకుని బలమైన ఆయుధాలతో కొట్టిచంపారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను చెరువులోకి విసిరేశారు. మృతదేహాలను వెలికితీసిన పోలీసులు పోస్ట్‌మార్గం కోసం పంపారు. మృతులపై దొంగతనం కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయని, ఇదే వారిని చంపడానికి కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేవి తెలుసునే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జేసీ మధుస్వామి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అరగ జ్ఞానేందర్ సొంత జిల్లా తముకూరు జిల్లా కావడం విశేషం. కాగా, తుమకూరు జిల్లాలోని దళిత సంస్థలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించడంతో పాటు నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్ చేశాయి. గుబ్బి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-04-23T23:46:35+05:30 IST