
ఇంటర్నెట్ డెస్క్: కొందరు స్నేహితులు సరదాలు సంతోషాలకే వరకే పరిమితం అవుతారు. కానీ మరికొందరేమో ప్రతీది షేర్ చేసుకుంటారు. ఒకే కంచంలో తిని, ఓకే దగ్గర పడుకుంటూ ఉంటారు. అయితే ఎంత ప్రాణ స్నేహితులైనప్పటికీ తమ జీవిత భాగస్వాములను మాత్రం అస్సలు పంచుకోరు. కానీ ఓ ఇద్దరు స్నేహితులు మాత్రం.. ఒకే జీవిత భాగస్వామి కావాలంటున్నారు. ఇందుకోసం ఏకంగా సోషల్ మీడియాలో ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
మలేషియాకు చెందిన ఫాతిమా అజ్రాహ్ (31), ఫాతిమా అక్మా(27) ఇద్దరికి కొద్ది సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. అదికాస్తా స్నేహంగా మారింది. దీంతో ఇద్దరూ ఒకరి విషయాలను మరొకరితో చెప్పుకునేవారు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రాణ స్నేహితులుగా మారారు. తాజాగా ఈ ఇద్దరూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఫేస్బుక్లో ప్రకటన కూడా విడుదల చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను కూడా షేర్ చేసిన ఈ ఇద్దరూ.. ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ ప్రపోజల్ నచ్చితే తమను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావాలని కోరారు. అంతేకాకుండా ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల తమకేమీ ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్గా మారింది. స్పందిస్తున్న కొందరు నెటిజన్లు వారి నిర్ణయాన్ని సమర్థిస్తుంటే.. మరికొందరేమో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఫాతిమా అజ్రాహ్కు ఇదివరకే పెళ్లైంది. ఆమెకు ఓ బిడ్డ కూడా ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె తన భర్తకు దూరమైంది.
ఇవి కూడా చదవండి