కృష్ణా ట్రైబ్యునల్‌లోకి ఇద్దరు పూర్వ అధికారులు

ABN , First Publish Date - 2021-07-25T08:00:06+05:30 IST

కృష్ణా ట్రైబ్యునల్‌లోఇద్దరు పూర్వ అధికారులకు పోస్టింగు ఇస్తూ కేంద్ర కేబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది...

కృష్ణా ట్రైబ్యునల్‌లోకి ఇద్దరు పూర్వ అధికారులు

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కృష్ణా ట్రైబ్యునల్‌లోఇద్దరు పూర్వ అధికారులకు పోస్టింగు ఇస్తూ కేంద్ర కేబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌గా పనిచేసిన డాక్టర్‌ ఎస్‌.కె.శ్రీవాస్తవను ఏడాది కాలం పాటు ట్రైబ్యునల్‌లో నియమించారు. దాంతో పాటు కేంద్ర జలవన రుల సంఘం (సీడబ్ల్యూసీ) పూర్వ చీఫ్‌ ఇంజనీర్‌ రవిశంకర్‌ను కూడా కృష్ణా ట్రైబ్యునల్‌లో నియమించారు. వీరిద్దరూ ఇప్పటికే పదవీ విరమణ చేయడంతో రీఎంప్లాయీమ్‌మెంట్‌ కింద నియమించారు. విధుల్లోకి చేరిన రోజు నుంచి ఏడాదికాలం పాటు వారు విధులు నిర్వర్తించనున్నారు. కృష్ణా నదీ జలాల వివాదాల ట్రైబ్యునల్‌ -2 కాలవ్యవధిని ఇప్పటికే ఏడాది పాటు పొడిగించిన విషయం విదితమే.


Updated Date - 2021-07-25T08:00:06+05:30 IST