కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ

ABN , First Publish Date - 2022-05-22T04:29:47+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ కొక్కి రాల ప్రేంసాగర్‌రావు అన్నారు. కొర్విచెల్మ గ్రామంలో శనివారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండలో మాట్లాడారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ
కొర్విచెల్మ రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు ప్రేంసాగర్‌రావు

 

 దండేపల్లి,  మే 21 : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ కొక్కి రాల ప్రేంసాగర్‌రావు అన్నారు. కొర్విచెల్మ గ్రామంలో శనివారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండలో మాట్లాడారు. ఇందిరమ్మ రైతు భరోసా పేరుతో రైతుకు రూ.15 వేలు ఎకరానికి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ రైతుల నడ్డి విరిచారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ, ధరణి పోర్టల్‌ను రద్దుచేస్తామని పేర్కొన్నారు.  ఇటీవల వరంగల్‌ సభలో డిక్లరేషన్‌ కర పత్రాలను ప్రతి ఇంటింటా ప్రజలకు అర్ధమయ్యేలా ప్రచారం చేయాలని నాయకులకు సూచించారు. జడ్పీ టీసీ గడ్డం నాగరాణి, ఎంపీటీసీలు, నాయకులు శకుం తల, కాంతారావు, వెంకటేష్‌ పాల్గొన్నారు.

చెన్నూరురూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టిం చుకోవడం లేదని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం   సంకారం లో సీనియర్‌ నాయకుడు బాపగౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని పేర్కొన్నారు. కేసీఆర్‌ పాలనలో రైతులు దగా పడుతు న్నారని పేర్కొన్నారు. చెన్నూరు ఇన్‌చార్జి రఘునాధ్‌ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు రమేష్‌, నాయకులు రాజేం దర్‌, శ్రీనివాస్‌, లచ్చయ్య, ప్రేంచంద్‌ పాల్గొన్నారు.

జన్నారం: జన్నారంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకు ముందు రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. 

కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బోర్లకుంట ప్రభు దాస్‌ మాట్లాడుతూ రైతు డిక్లరేషన్‌ ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబానికి తెలియజేయాలన్నారు. నాయ కులు మోహన్‌రెడ్డి, మహేష్‌, పసివుల్లా, రమేష్‌, హజార్‌, ఇందయ్య, గంగన్నయాదవ్‌,  పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-05-22T04:29:47+05:30 IST