కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.2లక్షలు రుణమాఫీ

ABN , First Publish Date - 2022-05-22T06:07:20+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకా లంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని డీసీసీ అధ్యక్షుడు కుంభం అని ల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.2లక్షలు రుణమాఫీ
రేవనపల్లిలో రైతులకు కరపత్రాలు పంచుతున్న డీసీసీ అధ్యక్షుడు కుంభం

భూదాన్‌పోచంపల్లి, మే 8:  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకా లంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని డీసీసీ అధ్యక్షుడు కుంభం అని ల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని రేవనపల్లిలో శనివారం నిర్వహిం చిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయన్నారు. వరి వేస్తే రైతులకు ఉరి వేసుకోవాల్సి వస్తుందన్న సీఎం మాటలతో సగం మంది రైతులు పంటలు వేయకుండా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కుమ్మకై రైతులను మభ్యపెడుతు న్నాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్ర మంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తడక వెంకటేశం, మండల అధ్యక్షుడు పాక మల్లేష్‌,  కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు మర్రి నర్సింహ్మారెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ సామ మోహన్‌రెడ్డి, నాయకులు జగన్‌రెడ్డి, కాసుల అంజయ్య, వెం కటేష్‌, రావుల జంగయ్య, గణేష్‌,  ప్రకాష్‌,  అనిల్‌, తదితరులు పాల్గొన్నారు. 

భువనగిరి రూరల్‌: రైతును రారాజు చేయడమే రాహుల్‌గాంధీ లక్ష్యమ ని మార్కెట్‌ మాజీ కమిటీ చైర్మన్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బర్రె జహంగీర్‌ అన్నారు. మండలంలోని అనాజీపురంలో వరంగల్‌ రైతు డిక్లరేషన్‌పై రైతులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహి ంచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని విస్మరించాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేపడుతామని, క్వింటా ధాన్యానికి రూ.2,500 మద్దతు ధర అందిస్తామని, ప్రతికౌలు రైతుకు రూ.15వేలు పంపిణీ చేస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించిన విషయాన్ని రైతులకు వివరించారు. కార్య క్రమంలో కాంగ్రెస్‌ నాయకులు దర్గాయి హరిప్రసాద్‌, మంగ ప్రవీణ్‌, గోద రాములుగౌడ్‌, కౌన్సిలర్లు ఈరపాక నర్సింహ, పడిగెల రేణుక ప్రదీప్‌, నా యకులు శ్రీరాం బాలరాజు, బొల్లేపల్లి అశోక్‌, వెంకటేశ్‌, సుధాకర్‌ ఉన్నారు. 

 ఆలేరు రూరల్‌: ప్రజలు కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని కోరు కుం టున్నారని పీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి అన్నారు. కొల్లూరులో రైతు సంఘర్షణ సభలో తీర్మానాలను తెలియజేశారు. కార్యక్రమంలో నా యకులు నీలం పద్మ, వెంకటస్వామి, శంకరయ్య, లింగం ఉన్నారు. 

Updated Date - 2022-05-22T06:07:20+05:30 IST