Viral News: ప్రేమలో పడితే ఇంతేనా.. ఇలా జీవితాలు నాశనం చేసుకోవాల్సిందేనా!

ABN , First Publish Date - 2022-07-31T20:41:16+05:30 IST

ఒకప్పుడు ప్రేమికులు మనసులు మాత్రమే ఇచ్చి పుచ్చుకునేవారు. కానీ ఇప్పటి ప్రేమికులు మాత్రం.. అంతటితో ఆగడం లేదు. ఇష్టపడ్డవారి కళ్లలో ఆనందం చూడటానికి ఖరీదైన గిఫ్ట్‌లను ఇస్తున్నారు. ప్రియురాళ్లు తమ తాహతు

Viral News: ప్రేమలో పడితే ఇంతేనా.. ఇలా జీవితాలు నాశనం చేసుకోవాల్సిందేనా!

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు ప్రేమికులు మనసులు మాత్రమే ఇచ్చి పుచ్చుకునేవారు. కానీ ఇప్పటి ప్రేమికులు మాత్రం.. అంతటితో ఆగడం లేదు. ఇష్టపడ్డవారి కళ్లలో ఆనందం చూడటానికి ఖరీదైన గిఫ్ట్‌లను ఇస్తున్నారు. ప్రియురాళ్లు తమ తాహతుకు మించిన కోరికలు కోరినా సరే అంటూ తల అడ్డంగా ఊపుతున్నారు. ఈ క్రమంలోనే అడ్డంగా బుక్కైపోతున్నారు. దొంగ అనే ముద్ర వేసుకుని జైలు పాలవుతున్నారు. తాజాగా జరుగిన ఘటనలే ఇందుకు నిదర్శనం. ప్రేయసి ముచ్చట తీర్చేందుకు ఓ ప్రియుడు తన స్నేహితుడితో  ఏకంగా ఏటీఎం‌కు కన్నం వేయబోయి.. పోలీసులకు దొరికిపోయాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


శనివారం తెల్లవారుజామున 2.15 గంటలకు ఢిల్లీలోని Ranhola పోలీస్ స్టేషన్‌లో ఫోన్ వచ్చింది. ఇద్దరు యువకులు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను పగలగొడుతున్నారని(trying to rob atm) ఫోన్‌లో అవతలి వాళ్లు చెప్పడంతో.. అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే.. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి యువకులు ఇద్దరు పరారయ్యారు. అక్కడ ఉన్న రికార్డైన సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి.. వారి కోసం గాలించారు. ఈ క్రమంలోనే ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. 



రాజస్థాన్‌(Rajasthan)లోని దౌసా జిల్లాకు చెందిన కమల్(27), పర్వీన్(20).. ఏటీఎంను కొల్లగొట్టడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. పర్వీన్ కొద్ది రోజులుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడని(Love).. ఆ యువతిని ఇంప్రెస్ చేయ్యాలని భావించినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే తన స్నేహితుడు కమల్‌తో కలిసి చోరీకి ప్రయత్నించినట్టు వివరించారు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ఇటువంటి ఘటనే మరోటి చోటు చేసుకుంది. ప్రేమించిన యువతికి ఖరీదైన గిఫ్ట్(costly gifts) ఇచ్చేందుకు ఓ యువకుడు మొబైల్ షాప్‌కు కన్నం వేశాడు. రాత్రంతా మొబైల్ షాప్‌లోనే ఉండి సుమారు రూ.15లక్షల విలువైన సెల్‌ఫోన్‌లు చోరీ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా.. ఈ వరుస ఘటనలపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ప్రేమలో పడితే ఇంతేనా.. ఆ యువకులు ఇక జీవితాంతం దొంగ అనే ముద్రను భరించాల్సిందేనా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.   


Updated Date - 2022-07-31T20:41:16+05:30 IST