
ఆ తల్లి కన్నకూతురి పైనే దాష్టికం ప్రదర్శించింది.. రెండు నెలల చిన్నారిని నిర్దాక్షిణ్యంగా చంపేసింది.. అనంతరం 14 గంటల పాటు మృతదేహాన్ని ఎవరి కంటా పడకుండా దాచింది.. చివరకు భర్తకు దొరికిపోయి అసలు విషయం బయటపెట్టింది.. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్లో ఉంటున్న గుల్షన్, డింపుల్ అనే జంటకు రెండు నెలల క్రితం ఓ ఆడపిల్ల జన్మించింది. ఆదివారం సాయంత్రం ఆ బాలిక అదృశ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆ చిన్నారి కోసం వెతకడం ప్రారంభించారు. భార్య ప్రవర్తనపై గుల్షన్కు అనుమానం కలిగించింది. ఆమెను ప్రశ్నించగా స్టోర్ రూంలో ఉన్న పాప మృతదేహం బయటపడింది. దీంతో గుల్షన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాలిక గొంతు కోసి చంపినట్టు డింపుల్ పోలీసుల ముందు అంగీకరించింది. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కన్న కూతురిని డింపుల్ ఎందుకు చంపిందనే విషయంలో క్లారిటీ లేదు. డింపుల్ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి