సామర్లకోట, మార్చి 27: సామర్లకోట పట్టణ పరిధిలో రెండు సిగరెట్ల విక్రయ దుకాణాలపై సామర్లకోట ఎస్ఐ టి.సునీత సిబ్బందితో ఆదివారం దాడులు నిర్వహించారు. నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సునీత తెలిపారు. 815 నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నా మని, వీటి విలువ సుమారు రూ.3వేలు ఉంటుందని చెప్పారు.