మెక్సికోలో ఒంటరిగా దొరికిన రెండేళ్ల పిల్లాడు.. ఇప్పుడు ఎక్కడకు చేరాడంటే..

ABN , First Publish Date - 2021-07-20T12:04:59+05:30 IST

కొన్నిరోజుల క్రితం వలసలను మోసుకెళ్తున్న ఒక ట్రక్కుకు సమీపంలో ఒంటరిగా కనిపించిన రెండేళ్ల పిల్లాడు..

మెక్సికోలో ఒంటరిగా దొరికిన రెండేళ్ల పిల్లాడు.. ఇప్పుడు ఎక్కడకు చేరాడంటే..

మెక్సికో: కొన్నిరోజుల క్రితం వలసలను మోసుకెళ్తున్న ఒక ట్రక్కుకు సమీపంలో ఒంటరిగా కనిపించిన రెండేళ్ల పిల్లాడు.. ఎట్టకేలకు తల్లిని చేరాడు. మెక్సికోలో వలసలను తరలిస్తున్న ట్రక్కులో ఒక వ్యక్తి మరణించడంతో.. దాన్ని సరిహద్దుకు సమీపంలో ఆపేశారు. అక్కడకు చేరుకున్న పోలీసు అధికారులకు ఈ ట్రక్కుకు సమీపంలో నిలబడి ఏడుస్తున్న రెండేళ్ల పిల్లాడు కనిపించాడు. ఈ ఘటన జూన్ నెలలో జరిగింది. 20 రోజులపాటు మెక్సికన్ పోలీసుల కస్టడీలో ఉన్న ఈ బుడతడిని ఎట్టకేలకు తల్లి దగ్గరకు చేర్చారా అధికారులు. ఆ పిల్లాడి తల్లి హోండూరస్ ప్రాంతంలో ఉంటుందని తెలుసుకున్న అధికారులు.. అక్కడకు చేరుకొని తల్లీబిడ్డలను కలిపారు. అమెరికా వలస వెళ్లిన తండ్రితో కలిసి ఈ పిల్లాడు వెళ్లినట్లు ఆ తల్లి చెప్పింది.

Updated Date - 2021-07-20T12:04:59+05:30 IST