ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు

Published: Sat, 26 Mar 2022 15:41:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు

ఢిల్లీ శాసనసభలో 2022-23కు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖా మంత్రి మనీష్ సిసోడియా ₹75,800 కోట్లతో శనివారం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది ఆమ్‌ఆద్మీ ప్రవేశపెట్టిన ఎనిమిదో బడ్జెట్ కావడం విశేషం. ఈ బడ్జెట్‌ను ‘రోజ్‌గార్ (ఉద్యోగ) బడ్జెట్’గా అభివర్ణించారు మనీష్ సిసోడియా. ఈ బడ్జెట్‌లో ఢిల్లీ ఎకానమీ పెంపు, ఉద్యోగ కల్పన వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ‘నైట్ ఎకానమీ’ డెవలప్‌మెంట్ కోసం రాత్రి ఎనిమిది నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు ఫుడ్ ట్రక్స్ ఏర్పాటుకు అనుమతించారు. టూరిజం డెవలప్ చేసేందుకు యాన్యువల్ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే ఐదేళ్లలో ఢిల్లీ పరిధిలో ఐదు లక్షల జాబ్స్ కల్పిస్తామని ప్రకటించారు. అలాగే ఢిల్లీని స్టార్టప్ క్యాపిటల్‌గా మార్చనున్నారు. దీని ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తారు. అలాగే బప్రోలా పరిధిలో ఎలక్ట్రానిక్ సిటీని నిర్మించనున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.