Ontario provincial polls: బరిలో ఏకంగా 20 మంది పంజాబీలు

Published: Sat, 14 May 2022 12:53:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Ontario provincial polls: బరిలో ఏకంగా 20 మంది పంజాబీలు

ఒంటారియో: కెనడాలోని Ontario provincial polls బరిలో ఏకంగా 20 మంది పంజాబీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అక్కడి మొత్తం 123 నియోజకవర్గాలకు జూన్ 2న పోలింగ్ జరగనుంది. ఇక కెనడాలో పంజాబీల సంఖ్య అధికంగా ఉంటదనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దేశ రాజకీయాల్లో మనోళ్లు కీలక పాత్రం పోషిస్తున్నారు. పలు కీలక పదవుల్లో భారత సంతతి వారే ఉన్నారు. దీంతో ఆ దేశానికి చెందిన మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన నేషనల్ డెమోక్రటిక్ పార్టీ (NDP), ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ పార్టీ (PC), లిబరల్స్ పంజాబీలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో పంజాబీలే అత్యధికంగా కలిపిస్తుంటారు.


ఇదే కోవలో తాజాగా Ontario provincial polls బరిలో ఏకంగా 20 మంది ఉండడం విశేషం. ఈ పోల్స్ తుది జాబితాలో లిబరల్ పార్టీ, ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ పార్టీ చెరో ఆరుగురు పంజాబీ అభ్యర్థులను బరిలో నిలిపాయి. అలాగే న్యూ డెమోక్రటిక్ పార్టీ ఐదుగురు, గ్రీన్ ఇద్దరు, ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరిలో చాలా మంది పంజాబీలు డయాస్పోరా ఆధిపత్యం ఉండే టొరంటోలోని బ్రాంప్టన్, మిస్సిసాగా శివారులోని 11 నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారు. ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ పార్టీ.. బ్రాంప్టన్ ఈస్ట్ నుండి హర్దీప్ గ్రేవాల్, బ్రాంప్టన్ వెస్ట్ నుండి అమంజోత్ సంధు, మిస్సిసాగా మాల్టన్ నుండి దీపక్ ఆనంద్‌లను పోటీకి దింపింది.


లిబరల్ పార్టీ.. బ్రాంప్టన్ ఈస్ట్ నుండి జన్నత్ గరేవాల్, బ్రాంప్టన్ నార్త్ నుండి హరీందర్ మల్హి, బ్రాంప్టన్ వెస్ట్ నుండి రిమ్మీ ఝజ్, మిస్సిసాగా మాల్టన్ నుండి అమన్ గిల్, బ్రాంట్‌ఫోర్డ్ బ్రాంట్ నుండి రూబీ టూర్, ఎసెక్స్ నుండి మన్‌ప్రీత్ బ్రార్‌లను బరిలో నిలిపింది. NDP.. బ్రాంప్టన్ సెంటర్ నుండి సారా సింగ్, బ్రాంప్టన్ నార్త్ నుండి సందీప్ సింగ్, బ్రాంప్టన్ వెస్ట్ నుండి నవజోత్ కౌర్, థార్న్‌హిల్ నుండి జస్లీన్ కాంబోజ్‌లను పోటీకి దింపింది. గ్రీన్ పార్టీ బ్రాంప్టన్ నార్త్ నుండి అనీప్ ధాడే, డర్హామ్ నుండి మినీ బాత్రాను నిలబెట్టగా, మన్జోత్ సెఖోన్ అంటారియో పార్టీ నుండి పోటీ చేస్తున్నారు.


బరిలో ఉన్న వారిలో 2018లో గెలిచిన ఏడుగురు పంజాబీలు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో ప్రముఖులు మిస్సిసాగా స్ట్రీట్‌విల్లే నుండి నినా టాంగ్రీ, మిల్టన్ నుండి పౌరసత్వం మరియు బహుళసాంస్కృతిక మంత్రి పార్మ్ గిల్, బ్రాంప్టన్ సౌత్ నుండి అంటారియో ట్రెజరీ బోర్డ్ ప్రెసిడెంట్ పర్బ్మీత్ సర్కారియా, బ్రాంప్టన్ ఈస్ట్ నుండి NDP జాతీయ అధ్యక్షుడు జగ్మీత్ సింగ్ తమ్ముడు గురతన్ సింగ్ ఉన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.