Thalapathy Vijay వారసుడు సినిమా కోసం.. 20 ఏళ్ల క్రితం నాటి పాట రీమిక్స్..!?

Published: Mon, 27 Jun 2022 15:51:50 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Thalapathy Vijay వారసుడు సినిమా కోసం.. 20 ఏళ్ల క్రితం నాటి పాట రీమిక్స్..!?

కోలీవుడ్‌ (Kollywood)తోపాటు టాలీవుడ్‌లోనూ పాపులారిటీ ఉన్న నటుడు దళపతి విజయ్. తమిళనాడులో అయితే ఈ నటుడికి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘బీస్ట్ (Beast)’ సినిమా తర్వాత ఈయన నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’. తెలుగులో ‘వారసుడు’. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. మహేశ్ బాబు హీరోగా చేసిన సూపర్ హిట్ మూవీ ‘మహర్షి’ తర్వాత ఆయన చేస్తున్న ఇదే కావడం విశేషం. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ తెరకెక్కుతోంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


‘దళపతి 66’గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి మూడు పోస్టర్స్‌ని విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవలే విడుదల చేశారు. అప్పటి నుంచి ఈ సినిమా గురించి రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. తాజాగా విజయ్ ఇరవై ఏళ్ల క్రితం చేసిన ‘యూత్’ సినిమాలోని ‘ఆల్ తొట్ట భూపతి’ సాంగ్‌ని రిమేక్ చేసేందుకు ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాట సినిమా చాలా ఇంపార్టెంట్ సిట్యూవేషన్‌లో వస్తుందని సమాచారం. అది కూడా 20 ఏళ్ల క్రితంలాగే విజయ్ అభిమానులను అలరిస్తుందని చెబుతున్నారు. అయితే.. ఒరిజినల్ సాంగ్‌‌ని తమన్ గురువు మణిశర్మ కంపోజ్ చేయగా.. ఇరవయ్యేళ్ల తర్వాత అదే సాంగ్‌ని శిష్యుడు రీమిక్స్ చేయనుండడం విశేషం.


అయితే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారిసు’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా.. ఈ మూవీలో రష్మికా మందన్నా (Rashmika Mandanna), ప్రభు, శరత్‌కుమార్, శ్రీకాంత్, షామ్, జయసుధ, ఖుష్బు, సంగీత క్రిష్, సంయుక్త, ప్రకాశ్ రాజ్, యోగి బాబు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 2023 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...