హైదరాబాద్: మీర్‌పేటలో 200 వాహనాలు సీజ్

ABN , First Publish Date - 2020-04-20T15:01:09+05:30 IST

లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి దాకా మీర్‌పేట పీఎస్‌ పరిధిలోని రెండు చెక్‌పోస్టుల వద్ద

హైదరాబాద్: మీర్‌పేటలో 200 వాహనాలు సీజ్

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి దాకా మీర్‌పేట పీఎస్‌ పరిధిలోని రెండు చెక్‌పోస్టుల వద్ద దాదాపు రెండు వందల వాహనాలను సీజ్‌ చేసినట్టు ఇన్‌స్పెక్టర్‌ యాదయ్య చెప్పారు. వాహనాలు పార్క్‌ చేయడానికి స్థలం లేనందున వాటికి సంబంధించిన ఆర్‌సీ బుక్కు, ఇన్సూరెన్స్‌ తదితర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని, వాహనాలు తిరిగి వారికే ఇస్తున్నామని, లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత వాహనాలు తమకు అప్పగిస్తే సదరు డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చేస్తామని పేర్కొన్నారు. వాహనాలను మాత్రం చట్టం ప్రకారం కోర్టుకు అప్పగిస్తామన్నారు. ఇక చెక్‌పోస్టుల వద్ద వివిధ కారణాలతో సుమారు 600 వాహనాలకు చలానాలు సైతం విధించినట్టు ఆయన పేర్కొన్నారు. 


గాంధీనగర్‌ పీఎస్‌ పరిధిలో.. 

లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించిన 300 ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశామని గాంధీనగర్‌ సీఐ సుంకరి శ్రీనివా్‌సరావు తెలిపారు. నిబంధనలు పాటించని కిరాణం దుకాణాదారులపై కూడా కేసులు నమోదు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Updated Date - 2020-04-20T15:01:09+05:30 IST