హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గ్లాండ్ ఫార్మా డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.204.1 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే నికర లాభం 32 శాతం వృద్ధి చెందింది. కాగా సమీక్షా కాలం లో మొత్తం ఆదాయం రూ.645.9 కోట్ల నుంచి రూ.859.4 కోట్లకు పెరిగింది. కొత్త ఔషధాల విడుదలతో పాటు కొత్త మార్కెట్లలోకి అడుగుపెట్టడం కలిసివచ్చిందని కంపెనీ తెలిపింది.