
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం బెంగళూరులోనే కొనసాగుతోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 93 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులోనే 75 మంది ఉన్నారు. 21 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. ఐదు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు కాగా మూడు జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. 128 మంది కోలుకోగా బెంగళూరులో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ జిల్లాల ఆసుపత్రుల్లో 1802 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరులోనే 1613 మంది ఉన్నారు. ఏడు జిల్లాల్లో యాక్టివ్ కేసులు లేవు.
ఇవి కూడా చదవండి