21 జిల్లాల్లో Covid కేసులు నిల్‌

ABN , First Publish Date - 2022-03-23T18:45:59+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం మరింత తగ్గింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 92 కేసులు నమోదు కాగా 21 జిల్లాల్లో ఒక్క కేసు కూడా లేదు. బెంగళూరులో 81 మంది బాధితులు కాగా ఐదు

21 జిల్లాల్లో Covid కేసులు నిల్‌

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం మరింత తగ్గింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 92 కేసులు నమోదు కాగా 21 జిల్లాల్లో ఒక్క కేసు కూడా లేదు. బెంగళూరులో 81 మంది బాధితులు కాగా ఐదు జిల్లాల్లో ఒక్కొక్కరు, మూడు జిల్లాల్లో ఇద్దరు చొప్పున నమోదయ్యారు. 143 మంది కోలుకున్నారు. బెంగళూరులో ఒకరు, హావేరిలో ఒకరు మృతిచెందారు. 28 జిల్లాల్లో మృతులు చోటు చేసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా 1838 మంది చికిత్సలు పొందుతుండగా నాలుగు జిల్లాల్లో యాక్టివ్‌ కేసులు లేకపోవడం గమనార్హం. అత్యధికంగా బెంగళూరులో 1631 మంది చికిత్సలు పొందుతున్నారు. 

Updated Date - 2022-03-23T18:45:59+05:30 IST