యువతి Love చేయట్లేదనే అక్కసుతో 21 ఏళ్ల కుర్రాడు పాడు పని..!

ABN , First Publish Date - 2021-11-09T17:03:29+05:30 IST

ప్రేమించడంలేదని అక్కసుతో...

యువతి Love చేయట్లేదనే అక్కసుతో 21 ఏళ్ల కుర్రాడు పాడు పని..!

  • యువతికి అసభ్యకర పోస్టులు..
  • యువకుడి అరెస్ట్‌

హైదరాబాద్ సిటీ/పేట్‌బషీరాబాద్‌ : ప్రేమించడంలేదని అక్కసుతో ఫేక్‌ ఐడీని సృష్టించి యువతికి సంబంధించిన  ఫొటోలు, అసభ్యకరమైన పోస్టులను పెడుతున్న యువకుడిని అరెస్టు చేసిన ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. సీఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం... మేడ్చల్‌ జిల్లా మైసమ్మగూడలోని ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్‌ చదువుతూ హాస్టల్‌లో ఉంటున్న సుమంత్‌(21) ఓ విద్యార్థినిని ప్రేమించమని వేధించ సాగాడు. యువతి ఒప్పుకోకపోవడంతో ఆమెకు సంబంధించిన ఇనిస్టాగ్రామ్‌ ఐడీ పేరుతో మరో ఫేక్‌ ఐడీని సృష్టించి దానిలో యువతికి సంబంధించిన ఫొటోలు, అసభ్యకరమైన పోస్టులు చేశాడు. దీంతో బాధిత యువతి పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Updated Date - 2021-11-09T17:03:29+05:30 IST