
బెంగళూరు: రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాలకు గాను 22 జిల్లాల్లో కొవిడ్ కేసులు నమోదు కాలేదు. శనివారం రాష్ట్రంలో మొత్తం 79 మందికి వైరస్ ప్రబలగా బెంగళూరులో 58 మంది కాగా మరో ఏడు జిల్లాల్లో 21 మంది నమోదయ్యారు. 94 మంది కోలుకోగా బెంగళూరులో ఒకరు మృతి చెందారు. మిగిలిన 29 జిల్లాల్లో కొవిడ్ మృతులు నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1776 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 1584 మంది ఉన్నారు. ఆరు జిల్లాల్లో యాక్టివ్ కేసులు నిల్ కాగా 16 జిల్లాల్లో పదిమందిలోపు చికిత్స పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి