3 నెలలు..22 ఐపీఓలు

ABN , First Publish Date - 2021-04-22T06:30:23+05:30 IST

ఈ ఏడాది తొలి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 22 కంపెనీలు తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ)కు వచ్చాయి. తద్వారా ఈ కంపెనీలు మొత్తం 257 కోట్ల డాలర్లు (రూ.19,275 కోట్లు) సేకరించాయని...

3  నెలలు..22 ఐపీఓలు

  • రూ.19,275 కోట్లు సేకరించిన కంపెనీలు 
  • ఏప్రిల్‌-జూన్‌లోనూ పబ్లిక్‌ ఇష్యూల జోరు 


న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 22 కంపెనీలు తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ)కు వచ్చాయి. తద్వారా ఈ కంపెనీలు మొత్తం 257 కోట్ల డాలర్లు (రూ.19,275 కోట్లు) సేకరించాయని ఈవై ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. భారత క్యాపిటల్‌ మార్కెట్లో జోరు ఇందుకు దోహదపడిందని పేర్కొంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలోనూ మార్కెట్లో ఐపీఓల జోష్‌ కొనసాగవచ్చని అంటోం ది. మరిన్ని విషయాలు.. 


  1. గడిచిన మూడు నెలల్లో ప్రధాన, ఎస్‌ఎంఈ మార్కెట్లలో మొత్తం 22 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చాయి. ఐపీఓ ల సంఖ్యాపరంగా భారత్‌ ప్రపంచంలో 9వ స్థానంలో ఉంది. 
  2. ప్రధాన మార్కెట్‌లో 17 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు రాగా,  గత ఏడాది తొలి త్రైమాసికానికి కేవలం ఒక కంపెనీ ఐపీఓకు వచ్చింది. 2020 చివరి త్రైమాసికంలో (అక్టోబరు-డిసెంబరు) 10 కంపెనీలు ఆఫరింగ్‌కు వచ్చాయి. 
  3. నిధుల సమీకరణ పరంగా ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అతిపెద్ద ఐపీఓ. ఈ కంపెనీ మార్కెట్‌ నుంచి 63.4 కోట్ల డాలర్లు సేకరించింది. 
  4. ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా 5 కంపెనీలు నిధులు సేకరించాయి. 2020 తొలి త్రైమాసికానికి 11, నాలుగో త్రైమాసికంలో 9 ఐపీఓలు నమోదయ్యాయి. 
  5. ప్రస్తుతం 20కి పైగా కంపెనీలు ఐపీఓకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరో 30 కంపెనీల్లో పెట్టుబడులు కలిగిన ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) ఇన్వెస్టర్లు వాటా ఉపసంహరణ యోచనలో ఉన్నాయి. 

అంతేకాదు, 500 కోట్ల డాలర్ల విలువైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌  ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్స్‌ (ఇన్విట్స్‌)  లైన్‌లో ఉన్నాయి. 


Updated Date - 2021-04-22T06:30:23+05:30 IST