పరీక్ష కోసం పక్కనే ఉన్న టౌన్‌కు వెళ్లిన 22ఏళ్ల యువతి.. అర్ధరాత్రి తండ్రికి ఫోన్ రావడంతో కంగారుగానే లిఫ్ట్ చేశాడు.. ఆ తర్వాత

ABN , First Publish Date - 2022-01-01T00:16:17+05:30 IST

ఆ యువతికి ప్రస్తుతం 22ఏళ్లు. కష్టపడి చదవి.. గవర్నమెంట్ జాబ్ కొట్టాలని.. ఆ తర్వాత తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఆమె కలలు కనేది. ఆ ఆలోచనలనే ఆచరణలో పెట్టింది. రాత్రి పగలూ తేడా లేకుండా ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయింది. పరీక్ష రాసేందుకు ప

పరీక్ష కోసం పక్కనే ఉన్న టౌన్‌కు వెళ్లిన 22ఏళ్ల యువతి.. అర్ధరాత్రి తండ్రికి ఫోన్ రావడంతో కంగారుగానే లిఫ్ట్ చేశాడు.. ఆ తర్వాత

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతికి ప్రస్తుతం 22ఏళ్లు. కష్టపడి చదవి.. గవర్నమెంట్ జాబ్ కొట్టాలని.. ఆ తర్వాత తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఆమె కలలు కనేది. ఆ ఆలోచనలనే ఆచరణలో పెట్టింది. రాత్రి పగలూ తేడా లేకుండా ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయింది. పరీక్ష రాసేందుకు పక్కనే ఉన్న టౌన్‌కు వెళ్లింది. ఎగ్జామ్ పూర్తయ్యాక తండ్రికి ఫోన్ చేసి, ఇంటికి తిరుగు పయనమైనట్టు చెప్పింది. ఇంటికి తిరిగొస్తున్నాను అన్నా కూతురు చీకటి పడినా ఇంటికి చేరుకోలేదు. దీంతో తండ్రి మనసులో అలజడి మొదలైంది. కూతురు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో కంగారు పడ్డాడు. సమయం కాస్తా అర్ధరాత్రి అయింది. అయినా కూతురు ఇంటికి రాలేదు. అప్పుడే ఫోన్ రింగ్ అయింది. దీంతో కంగారు పడుతూనే ఆ తండ్రి ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతలి వాళ్లు చెప్పింది విని షాకయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని బందీకూయ్ ప్రాంతానికి చెందిన హేమలత మీన.. గవర్నమెంట్ జాబ్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుని అందుకోసం కొద్ది రోజులుగా ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలోనే విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (వీడీఓ) పోస్టుకు దరఖాస్తు చేసింది. డిసెంబర్ 28న పరీక్ష ఉండటంతో ఓ రోజు ముందుగానే జైపూర్‌కు వెళ్లింది. డిసెంబర్ 28న పరీక్ష ముగిసిన తర్వాత.. తన తండ్రి లక్ష్మీలాల్‌కు ఫోన్ చేసి, ప్యాసింజర్ రైలులో ఇంటికి తిరుగుపయనమవుతున్నట్టు చెప్పింది. అయితే కూతురు ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో రాత్రి ఎనిమిది గంటలకు లక్ష్మీలాల్.. హేమలతకు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో కంగారు పడ్డాడు. 



భయపడుతూనే కూతురు కోసం ఎదురు చూస్తున్న క్రమంలో.. అర్ధరాత్రి జైపూర్‌లోని ఆసుపత్రి నుంచి అతడికి ఓ ఫోన్ వచ్చింది. తన కూతురు ట్రైన్ నుంచి కిందపడి చనిపోయిందని తెలిసి షాకయ్యాడు. కూతురిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లాడు. అనంతరం తమ ప్రాంతంలో నివసించే సోనూ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోనూ కొద్ది రోజులుగా తన కూతురు వెంట పడుతున్నాడని.. హేమలతను అతడే ట్రైన్‌ నుంచి తోసోసి ఉంటాడని ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2022-01-01T00:16:17+05:30 IST