కెనడా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ డ్రా.. దేశంలోకి 2250 మంది విదేశీయులకు అనుమతి

ABN , First Publish Date - 2022-08-21T04:57:29+05:30 IST

కెనడాలో విదేశీయులకు శాశ్వత నివాసాహర్హ కల్పించే ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ డ్రాలో ఈ మారు 2250 మంది ఎంపికయ్యారు.

కెనడా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ డ్రా.. దేశంలోకి 2250 మంది విదేశీయులకు అనుమతి

ఎన్నారై డెస్క్: కెనడాలో విదేశీయులకు శాశ్వత నివాసాహర్హ కల్పించే ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ డ్రాలో ఈ మారు 2250 మంది ఎంపికయ్యారు. వారందరికీ కెనడా ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందాయి. కాగా.. ఈ మారు డ్రాలో పాల్గొన్న వారి కనీస స్కోరు 525గా ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీకీ అనుబంధంగా వీసా ప్రోగ్రామ్ ఏదీ లేకపోవడంతో.. కెనేడియన్ ఎక్స్‌పీరియన్స్ క్లాస్, ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్ కింద ఎక్స్‌ప్రెస్ ఎంట్రీకి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా కెనడాలో నివసించేందుకు దరఖాస్తు చేసుకున్న విదేశీయుల కోసం ఉమ్మడిగా కెనడా ప్రభుత్వం ఇప్పటివరకూ నాలుగు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ డ్రాలు నిర్వహించింది. వీటిల్లో ఎంపికైన 7500 మందికి ఆహ్వానాలు పంపించింది. తాజాగా 229వ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ డ్రా నిర్వహించింది. తాజా డ్రాలో కనీస స్కోరును గతంతో పోలిస్తే 8 పాయింట్లు తగ్గించిన ప్రభుత్వం..ఈ మారు అదనంగా 250 మంది దేశంలోని ఆహ్వానించేందుకు నిర్ణయించింది. 

Updated Date - 2022-08-21T04:57:29+05:30 IST