23 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు

ABN , First Publish Date - 2022-08-13T05:28:54+05:30 IST

జిల్లాలో పనిచేస్తున్న 23 మంది ఎంపీడీవోలకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు శుక్రవారం పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సొంత జిల్లాలో పనిచేసేలా ఉత్తర్వుల్లో సడలింపు ఇచ్చారు. ఈ మేరకు చాలా మంది ఎంపీడీవోల

23 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు
జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి

జడ్పీ సీఈవోగా సుధాకర్‌రెడ్డి

డీపీవోగా ప్రభాకర్‌రెడ్డి

కర్నూలు జిల్లా డ్వామా పీడీగా బి.అమరనాథరెడ్డి

ఇతర ఎంపీడీవోలకు డ్వామా, ఇతర శాఖలలో కీలక పదవులు

కడప(రూరల్‌), ఆగస్టు12 : జిల్లాలో పనిచేస్తున్న 23 మంది ఎంపీడీవోలకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు శుక్రవారం పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సొంత జిల్లాలో పనిచేసేలా ఉత్తర్వుల్లో సడలింపు ఇచ్చారు. ఈ మేరకు చాలా మంది ఎంపీడీవోలకు వైఎ్‌సఆర్‌ కడప జిల్లాలోనే పదోన్నతులు లభించాయి. ఇందులో సీనియారిటీ జాబితా ప్రకారం నలుగురు ఎంపీడీవోలకు జిల్లా స్థాయి పదువులు లభించాయి. వీరిలో జడ్పీ సీఈవోగా ఎం.సుధాకర్‌రెడ్డి, జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ జిల్లా అధికారిగా(డీపీవో) పి.ప్రభాకర్‌రెడ్డి, కర్నూలు జిల్లా డ్వామా పీడీగా బి.అమరనాథరెడ్డి, కడప జిల్లా జడ్పీ డిప్యూటీ సీవోగా జీవీ రమణారెడ్డి ఉన్నారు. 

అలాగే జమ్మలమడుగు డివిజన్‌ డీఎల్‌డీవో(జడ్పీ)గా సి.సుబ్రమణ్యం, కడప డివిజన్‌ డీఎల్‌డీవోగా జి.వెంకటసుబ్బయ్య, డ్వామా ఏపీడీగా ఎంసీ మద్దిలేటి, డ్వామా ఏవోగా సి. మైఽథిలి, జమ్మలమడుగు డ్వామా ఏపీడీగా సి.నాగరత్నమ్మ, ఏపీవోగా ఐ.బాలమునెయ్య, కడప విజిలెన్స్‌ ఆర్‌వీవోగా ఎస్‌.ఖాదర్‌బాషా, ప్రొద్దుటూరు మున్సిపల్‌ కమిషనర్‌గా పి. వెంకటరమణయ్యలకు సొంత జిల్లాలోనే పదోన్నతులు కల్పించారు. 

అన్నమయ్య జిల్లాలోని రాజంపేట డ్వామా ఏపీడీగా ప్రతాప్‌, లక్కిరెడ్డిపల్లె డ్వామా ఏపీవోగా జి. రెడ్డయ్యనాయుడు, విజయవాడ ఎస్‌ఏసీ ఈడీగా పి.ఉమాదేవి, ప్రకాశం జిల్లా కందుకూరు డ్వామా ఏపీడీగా బి.అర్జున్‌రావు, అనంతపురం జిల్లాలోని చెవ్వూరు డ్వామా ఏపీడీగా ఎస్‌.జయసింహ, కర్నూలు జిల్లా డ్వామా ఏపీడీగా ఆర్‌.రామచంద్రారెడ్డి, నంద్యాల జిల్లా డీఎల్‌డీవోగా ఎం.జనార్ధన్‌రావు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా డ్వామా ఏపీడీగా ఐ.స్వరూప, విశాఖపట్నం డ్వామా ఏవోగా సి.ఉషారాణి, చిత్తూరు జిల్లా డ్వామా ఏపీవోగా ఎ.రవికుమార్‌, గుంటూరు జిల్లా డ్వామా ఎప్‌ఎంగా కె.హీరాలాల్‌కు పదోన్నతులు కల్పించారు. 

హర్షం : రాష్ట్ర ప్రభుత్వం ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించడం పట్ల పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జడ్పీ యూనిట్‌ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-08-13T05:28:54+05:30 IST