23ఏళ్ల యువతి.. గదిలో ఒంటరిగా ఉంటూ CA కోసం సన్నద్ధం.. తాజాగా షాకింగ్ నిర్ణయం.. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో..

Published: Thu, 24 Mar 2022 16:14:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
23ఏళ్ల యువతి.. గదిలో ఒంటరిగా ఉంటూ CA కోసం సన్నద్ధం.. తాజాగా షాకింగ్ నిర్ణయం.. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో..

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతికి ప్రస్తుతం 23ఏళ్లు. తల్లిదండ్రులతో పాటూ ఇంట్లో ఉంటూనే సీఏ కోసం ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో ఎప్పటిలాగే కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన ఆమె.. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆమె చేసిన పనికి కుటుంబ సభ్యులు విస్తుపోయారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బీహార్‌లోని ముజప్ఫర్‌పూర్ జిల్లాకు చెందిన అంజలీ జైస్వాల్‌కు ప్రస్తుతం 23ఏళ్లు. ఆమె తండ్రి అవదేశ్ చౌదరి చిరు వ్యాపారి. చిన్ననాటి నుంచి కష్టసుఖాలను చూస్తూ పెరిగిన అంజలీ.. పెద్ద చదువులు చదవి జీవితంలో ఉన్నతంగా బతకాలని భావించింది. ఈ క్రమంలోనే చార్టెడ్ అకౌంటెంట్‌గా స్థిరపడాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాత్రి పగలూ తేడా లేకుండా కష్టపడేది. ఈ నేపథ్యంలోనే ఎప్పటిలాగే తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన ఆమె.. తన గదికి వెళ్లిపోయింది. అనంతరం అర్ధరాత్రి సమయంలో గది నుంచి బయటికొచ్చి టీ పెట్టుకుని తాగి.. ప్రిపరేషన్ మొదలు పెట్టింది. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. అందరూ పడుకున్న తర్వాత గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 


తెల్లారిన తర్వాత అంజలీ ఎంతకూ గది నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. తలుపు తట్టినా.. ఉలుకూ పలుకూ లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. తలపులు బద్దలు కొట్టి గదిలోకి ప్రవేశించారు. లోపల ఉరితాడుకు వేలాడుతున్న అంజలీని చూసి ఆమె కుటుంబ సభ్యులు విస్తుపోయారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించిన అధికారులు.. కేసు నమోదు చేసుకున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందనీ.. అందుకే మృతదేహం నల్లగా మారిపోయిందని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.