మళ్లీ కేసుల కలకలం!

ABN , First Publish Date - 2021-03-01T09:08:21+05:30 IST

రాష్ట్రంలో మొన్నటి వరకు రోజుకు 50-60 మాత్రమే నమోదవుతున్న కేసులు రెండు రోజుల నుంచి 100 దాటేయడం కలవరం రేపుతోంది.

మళ్లీ కేసుల కలకలం!

రెండు రోజుల్లోనే 235 పాజిటివ్‌లు


అమరావతి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో  మొన్నటి వరకు రోజుకు 50-60 మాత్రమే నమోదవుతున్న కేసులు రెండు రోజుల నుంచి 100 దాటేయడం కలవరం రేపుతోంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 118 మంది కరోనా బారినపడగా.. ఆదివారం కూడా 117 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,89,916కి పెరిగింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 41 మందికి వైరస్‌ సోకింది. కరోనా కలకలం మొదలైన తొలినాళ్లలో కర్నూలు అల్లాడిపోయింది. ఆ తర్వాత తూర్పుగోదావరి, కృష్ణా జిల్లా ల్లో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండేది. అయితే.. ప్రస్తుతం కరోనా ప్రభావం చిత్తూరుపైనే ఎక్కువగా కనిపిస్తోంది. గత ఆదివారం నుంచి శనివారం వరకు వరుసగా 21, 10, 18, 21, 21, 22, 33 కేసులు నమోదయ్యాయి. 28న ఏకంగా 41 కేసులు బయటపడ్డాయి. సెకండ్‌వేవ్‌ను తట్టుకోవాలంటే ఈ జిల్లాపై ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టిసారించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2021-03-01T09:08:21+05:30 IST