వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇవ్వాలి :ఉత్తమ్‌

ABN , First Publish Date - 2022-10-02T05:56:13+05:30 IST

వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ అం ది ంచాలని, రైతులకు ఏకకాలంలో లక్ష రుణమాఫీ చేయాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇవ్వాలి :ఉత్తమ్‌
హుజూర్‌నగర్‌ మండల పరిషత్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ ఉత్తమ్‌

హుజూర్‌నగర్‌, అక్టోబరు 1: వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ అం ది ంచాలని, రైతులకు ఏకకాలంలో లక్ష రుణమాఫీ చేయాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. హుజూర్‌నగర్‌లో శనివారం జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. అధికారులు 10గంటల విద్యుత్‌ ఇస్తున్నామని చెబుతుండగా, ప్రభుత్వం 24గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతోందన్నారు. రైతులను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు 36వేలకు మించి రైతులకు రుణ మాఫీ చేయలేదన్నారు. సాగర్‌ ఎడమకాల్వపైన, ఇతర లిఫ్టులను ప్రభుత్వమే నిర్వహిస్తుందని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఎనిమిది సంతవ్సరాలైనా పట్టించుకోవడం లేదన్నారు. సాగర్‌ ఎడమకాల్వ పరిధిలో అదనంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించ లేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వమే నిర్వహిస్తున్నప్పుడు లిఫ్టులను ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, ఎంపీడీవో శాంతకుమారి పాల్గొన్నారు.


సమావేశంలో వాడివేడి చర్చ

జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, గోపాలపురం ఎంపీటీసీ రాజారావు ప్రోద్బలం తో అధికారులను ఉసిగొలిపి గ్రామపంచాయతీ రికార్డులు సీజ్‌ చేయించారని గోపాలపురం సర్పంచ్‌ శాసనాల నాగసైదులు ఆరోపించారు. గ్రామపంచా య తీకి  కేసీఆర్‌ మంజూరు చేసిన రూ.20లక్షల నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, తనకు తెలియకుండా పనులు చేస్తున్నారని సర్పంచ్‌ ఆరోపించారు. ఆధారాలుంటే నిరూపించాలని జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి అన్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం లిఫ్టులకు రూ.1200 కోట్లు, చెక్‌డ్యాంలు, కాల్వలైన్‌కు మరో రూ.1200 కోట్లు మంజూరు చేసిందని జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి తెలిపారు. ఆయకట్టు పెరుగుతోందని వివరించారు. ఎంపీ ఉత్తమ్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక సాగర్‌ ఎడమకాల్వ పరిధిలోని ముక్త్యాల బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిలో ఒక్క ఎకరం ఆయకట్టు కూడా పెరగలేదన్నారు. సీఎం హుజూర్‌నగర్‌ సభలో హామీలు ఇచ్చినా అమలు కాలేదన్నారు. దీంతో జెడ్పీటీసీ సైదిరెడ్డి, ఉత్తమ్‌ల మధ్య సంవాదం జరిగింది. సమావేశం తర్వాత బయటికి వెళ్తున్న సమయంలో ఎంపీ ఉత్తమ్‌తో జెడ్పీటీ సీ సైదిరెడ్డి అమరవరం సొసైటీకి సంబంధించి నిధుల విషయంలో వివరించారు. ఎంబీలు లేకుండా సొసైటీ పనులు చేయలేదని వివరించారు. 


అటవీ భూములు కబ్జాకు గురవుతున్నాయి : ఎంపీ  ఉత్తమ్‌ 

మేళ్లచెర్వు: హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని అటవీ భూములు కబ్జాలకు గురవుతున్నాయని, అధికార పార్టీ నాయకులే ఇందుకు సహకరిస్తున్నార ని ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి మేళ్లచెర్వు మండలంలో శనివారం పర్యటించారు. చింతలపాలెంలో రైతులతో సమావేశమయ్యారు. శివగంగ ఎత్తిపోతల ద్వారా నీళ్లు రావడం లేదని కొందరు రైతులు ఉత్తమ్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. చిం తలపాలెం మండలంలో ఓ ప్రజాప్రతినిధి వేల ఎకరాలు భూ కబ్జాలకు పాల్పడుతుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీపీ సైదేశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకులు కొండారెడ్డి, ఇంద్రారెడ్డి, సైదులు ఉన్నారు. 

Updated Date - 2022-10-02T05:56:13+05:30 IST