Heavy rains: 24 ఏళ్ల తర్వాత నిండిన తిప్పగొండనహళ్లి రిజర్వాయర్‌

ABN , First Publish Date - 2022-09-07T17:05:11+05:30 IST

రాజధాని చుట్టు పక్కల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బెంగళూరుకు గతంలో తాగునీటిని అందించిన తిప్పగొండనహళ్లి

Heavy rains: 24 ఏళ్ల తర్వాత నిండిన తిప్పగొండనహళ్లి రిజర్వాయర్‌

బెంగళూరు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాజధాని చుట్టు పక్కల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బెంగళూరుకు గతంలో తాగునీటిని అందించిన తిప్పగొండనహళ్లి రిజర్వాయర్‌(Tippagondanahalli Reservoir) 24ఏళ్ల అనంతరం పూర్తిగా నిండింది. దీంతో గేట్లను తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. హెసరఘట్ట రిజర్వాయర్‌లోనూ నీరు గరిష్ట ప్రమాణానికి చేరిందని అధికారులు వెల్లడించారు. 1998లో తిప్పగొండనహళ్లి రిజర్వాయర్‌ గరిష్ట ప్రమాణానికి చేరినట్టు రికార్డులు ఉన్నాయి. రిజర్వాయర్‌లో ప్రస్తుతం 70 అడుగుల నీరు ఉందని అధికారులు తెలిపారు. బెంగళూరు, శివగంగ(Bengaluru, Sivaganga) ప్రాంతం నుంచి వర్షపునీరు ఎడతెరిపి లేకుండా వస్తుండడంతో రిజర్వాయర్‌ పూర్తిగా నిండిందన్నారు. సాధారణంగా ఈ రిజర్వాయర్‌లో 60 అడుగులకు మాత్రమే నీరు ఉండేది. సెప్టెంబరు మొదటివారంలోనే ఈసారి 70 అడుగులకు చేరింది. రిజర్వాయర్‌ గరిష్ట నీటి సామర్థ్యం 74 అడుగులుగా ఉన్నప్పటికీ ముందుజాగ్రత్తగా నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2022-09-07T17:05:11+05:30 IST