ఉమ్మడి జిల్లాలో 242 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-07-27T06:19:20+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షల్లో 242 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఉమ్మడి జిల్లాలో 242 కరోనా పాజిటివ్‌ కేసులు

 గుట్టలో వ్యాక్సిన కోసం తిప్పలు
నల్లగొండ, యాదాద్రి రూరల్‌, జూలై 26: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షల్లో 242 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నల్లగొండ జిల్లా లో 147, సూర్యాపేటలో 39, యాదాద్రి జిల్లాలో 56 కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 1,38,069మం దికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, చికిత్స పొందుతూ 579 మంది మృతిచెందారు. చికిత్స అనంతరం సూర్యాపేట జిల్లాలో 26,014 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 30,096మంది డిశ్చార్జి కాగా, సూర్యాపేటలో 12,538మంది, యాదాద్రి జిల్లాలో 1,516మంది ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది హోంఐసొలేషనలో ఉన్నారు. కాగా, గుట్ట పీహెచసీతోపాటు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వ్యాక్సినేషన కేంద్రా లు ఉండగా, 300 మందికి మాత్రమే టీకా ఇస్తున్నారు. అయితే టీకా కోసం వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఫలితంగా అందరికీ టీకా అందక ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. టీకా కోసం మూడు రోజులుగా తిరుగుతున్నానని, గౌరాయిపల్లికి చెందిన ఒకరు తెలిపారు.

Updated Date - 2021-07-27T06:19:20+05:30 IST