2,452.32 కోట్లు

ABN , First Publish Date - 2022-08-11T08:35:35+05:30 IST

కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణ రాష్ట్రానికి రూ.2,452.32 కోట్లు విడుదలయ్యాయి.

2,452.32 కోట్లు

రాష్ట్రానికి అందిన కేంద్ర పన్నుల వాటా 

ఇప్పటివరకు వచ్చినవి 4,252 కోట్లు

బడ్జెట్‌లో రూ.12,407.64 కోట్లు 

వస్తాయని అంచనా ఏపీకి 2 వాయిదాల్లో రూ.4721 కోట్లు


హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణ రాష్ట్రానికి రూ.2,452.32 కోట్లు విడుదలయ్యాయి. ఈమేరకు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం అన్ని రాష్ట్రాలకు వాటి పన్నుల వాటాలను విడుదల చేసింది. రెండు వాయిదాలకు సంబంధించి మొత్తం రూ.1,16,665.75 కోట్లను పంపించింది. ఇందులో తెలంగాణకు రెండు వాయిదాల కింద రూ.2,452.32 కోట్లు వచ్చాయి. దీంతో రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటా కింద ఇప్పటివరకు మొత్తం రూ.4,245.63 కోట్లు వచ్చినట్లయింది. ఈసారి బడ్జెట్‌(2022-23)లో కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.12,407.64 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. మిగతా సొమ్ము ఆర్థిక సంవత్సరాంతం వరకు సమకూరనుంది. కాగా.. తాజా విడుదలలో ఆంధ్రప్రదేశ్‌కు రెండు వాయిదాల కింద రూ.4,721.44 కోట్లు వచ్చాయి. 

Updated Date - 2022-08-11T08:35:35+05:30 IST