ఒక్కరోజులో 2,47,417 కేసులు

Jan 14 2022 @ 02:44AM

  • దేశంలో ఒక్కరోజు కొవిడ్‌ కేసులు 
  • ఒమైక్రాన్‌ కేసులు ఐదు వేల పైనే..
  • కాంగ్రెస్‌ నేతలు మొయిలీ, ఖర్గేకు కరోనా
  • రాష్ట్రంలో 2,707 పాజిటివ్‌లు
  • గాంధీలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు
  • పదకొండు మంది గర్భిణులకు పాజిటివ్‌
  • 5 కోట్లు దాటిన కొవిడ్‌ టీకాలు: హరీశ్‌ 
  • ఏపీలో ఒక్కరోజే 4,348 కేసులు
  • 236 రోజుల తర్వాత అత్యధికం.. 
  • 13.11 శాతంగా పాజిటివిటీ రేటు


న్యూఢిల్లీ, జనవరి 13: దేశంలో కరోనా వ్యాప్తి వేగం పెరిగింది. థర్డ్‌వేవ్‌లో తొలిసారిగా రోజువారీ కేసుల సంఖ్య 2 లక్షల మార్కు దాటింది. ఒక్క రోజు లో 27ు పెరిగి బుధవారం 2,47,417 కొత్త కేసులు నమోదయ్యాయి. గత ఏడాది మే 21 (236 రోజులు) తర్వాత ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,63,17,927కి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి చేరగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 10.80గా నమోదైంది. అలాగే, యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా వేగం గా పెరుగుతూ 216రోజుల్లో అత్యధికంగా 11,17,531కి చేరింది. మొత్తం కేసుల్లో ఇది 3.08ు. దీంతో రికవరీ రేటు 95.59 శాతానికి తగ్గింది. అలాగే, రోజు వ్యవధి లో 380 మంది కొవిడ్‌తో మృత్యువాత పడగా.. మొ త్తం మరణాల సంఖ్య 4,85,035కి చేరుకుంది. మొ త్తం కేసుల్లో మరణాల శాతం 1.34కి పెరిగింది. కాగా, ఢిల్లీలో వరుసగా రెండో రోజూ భారీగా కేసులు నమోదయ్యాయి. ఇక్క డ గత 24 గంటల్లో 28,867 మందికి వైరస్‌ సోకగా.. 31 మరణాలు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 29.21ుకు చేరుకుంది. గత ఏడాది మే 3 తర్వాత ఢిల్లీలో నమోదైన అత్యధిక పాజిటివిటీ రేటు ఇదే. 


ముంబైలో మాత్రం క్రితం రోజుతో పోల్చితే 3 వేలకు పైగా తగ్గి 13,702 కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు కూడా 16.55ుకు తగ్గింది. కర్ణాటకలో ఒక్కరోజులో 25,005 మందికి పాజిటివ్‌ రాగా.. బెంగళూరులోనే 18,374 మందికి వైరస్‌ సోకడం అక్కడ వ్యాప్తి తీవ్రత ను తెలుపుతోంది. బెంగాల్‌లో 32.13ు పాజిటివిటీ రేటుతో 24 గంటల్లో 23,467 కొత్త కేసులు వెలుగు చూశాయి. తమిళనాడులో 20,911 కేసులు, 25 మరణాలు నమోదుకాగా.. కేరళలో 13,468 కేసులు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు బుధవారం నమోదైన పాజిటివ్‌ల్లో 620 కేసులు ఒమిక్రాన్‌ వేరియంట్‌కు చెందినవని తేలింది. రోజువారీ ఒమైక్రాన్‌ కేసుల్లో ఇప్పటివరకు ఇదే అత్యధికం. దీంతో ఈ కేసుల సంఖ్య 5,488కి పెరిగింది. ఇందులో 1,367 కేసులతో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉండగా.. రాజస్థాన్‌ (792), ఢిల్లీ (549), కేరళ (486), కర్ణాటక (479) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే కొవిడ్‌ బారినపడ్డారు. ఆయన హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నారు. వీరప్ప మొయిలీకి కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అసోం గవర్నర్‌ జగదీశ్‌ ముఖికి కరోనా నిర్ధారణ అయింది. ఎన్నికల విధుల నిర్వహణకు గుజరాత్‌ నుంచి ఉత్తరాఖండ్‌ చేరుకున్న 30 మంది బీఎ్‌సఎఫ్‌ జవాన్లు కొవిడ్‌ బారినపడ్డారు. 


ముగ్గురు నెలల శిశువులు మృతి

ఢిల్లీలో గత 4 రోజుల్లో కరోనాతో ముగ్గురు నెలల శిశువులు మృతి చెందారు. వారిలో ఓ శిశువు వయసు 3 నెలలు. మరో ఇద్దరికి 7 నెలలు. ఈ ముగ్గురు శిశువుల తల్లిదండ్రులకూ కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చింది. శిశువులకు వైరస్‌ ఎలా సోకిందో అర్థం కావడం లేదు. కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్యను బట్టి వ్యాధి తీవ్రతను నిర్ధారించవద్దని నిపుణులు చె ప్పారు. ఢిల్లీలో ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు అధికంగా ఉందన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.