
హైదరాబాద్: గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 249 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం 6,61,551 కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 3,895 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 5,258 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో ఇవాళ 53,789 మందికి కరోనా పరీక్షలు చేశారు.