24న పుదువైకి అమిత్‌షా

ABN , First Publish Date - 2022-04-10T13:25:35+05:30 IST

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ నెల 24వ తేదీన పుదుచ్చేరి రానున్నారు. పుదువై ప్రభుత్వం చేపట్టిన అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారని రాష్ట్ర లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై

24న పుదువైకి అమిత్‌షా

                               - లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై 


పుదుచ్చేరి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ నెల 24వ తేదీన పుదుచ్చేరి రానున్నారు. పుదువై ప్రభుత్వం చేపట్టిన అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారని రాష్ట్ర లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పుదుచ్చేరి శాఖ ఆధ్వర్యంలో శనివారం వాకథాన్‌ నిర్వహించారు. రాజ్‌నివాస్‌ ఎదురుగా నిర్వహించిన ఈ వాకథాన్‌ను గవర్నర్‌ తమిళిసై  జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానసికంగా, శారీరిక ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరమని, యోగాసనాలు, ధ్యానం వంటివి పాటించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్‌, ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలను కలవడం సంతోషంగా ఉందని, ఇద్దరూ పుదుచ్చేరి అంటే ఎంతో ఆసక్తి చూపుతున్నారన్నారు. పుదుచ్చేరి రాష్ట్రాభివృద్ధికి తోడుగా ఉంటానని ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే, కేంద్ర ఆర్ధిక శాఖ, రైల్వే శాఖ మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్‌లపై చర్చించానన్నారు. ముఖ్యమంత్రిని ఢిల్లీకి తీసుకెళ్లలేదనే విమర్శలున్నాయని, ఆయనతో చర్చించిన తర్వాతే వెళ్లానని, రాష్ట్రం కోసం ఇద్దరం సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. పుదుచ్చేరి ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలు త్వరలో రానున్నాయని తమిళి సై తెలిపారు. 

Updated Date - 2022-04-10T13:25:35+05:30 IST