నా వల్ల కాదు.. నీ కోసం ఇక అప్పులు చేయలేనంటూ.. ఓ ప్రియుడు వాట్సప్‌లో మెసేజ్‌ పంపి మరీ..

ABN , First Publish Date - 2022-02-12T20:41:20+05:30 IST

ప్రియురాలు కోసం అప్పులు చేయడం తన వల్ల కాదంటూ ప్రియుడు దారుణానికి పాల్పడ్డాడు. ప్రేమించిన యువతిని ఉద్దేశిస్తూ ఆ ప్రియుడు చేసిన వాట్సప్ మెసేజ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందుకు సం

నా వల్ల కాదు.. నీ కోసం ఇక అప్పులు చేయలేనంటూ.. ఓ ప్రియుడు వాట్సప్‌లో మెసేజ్‌ పంపి మరీ..

ఇంటర్నెట్ డెస్క్: ప్రియురాలు కోసం అప్పులు చేయడం తన వల్ల కాదంటూ ప్రియుడు దారుణానికి పాల్పడ్డాడు. ప్రేమించిన యువతిని ఉద్దేశిస్తూ ఆ ప్రియుడు చేసిన వాట్సప్ మెసేజ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి చెందిన మనోజ్ బైర్వా(25) కొన్ని సంవత్సరాల క్రితం కుమారి అనే యువతిని చూసి ఇష్టపడ్డాడు. తన మనసులోని మాటను ఆమెకు చెప్పి, ప్రేమను వ్యక్త పరిచాడు. ఈ క్రమంలో మనోజ్ ప్రేమను ఆమె అంగీకరించింది. ఆ తర్వాత చెట్టాపట్టాలేసుకుని కొన్ని రోజులపాటు సంతోషంగా తిరిగారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. అకస్మాత్తుగా మనోజ్‌ను కుమారి దూరం పెట్టడం ప్రారంభించింది. కొద్ది రోజులకు బాంబులాంటి వార్త మనోజ్ చెవిన వేసింది. తాను మరొకరిని ప్రేమిస్తున్నానంటూ మనోజ్‌కు బ్రేకప్ చెప్పేసింది. దీంతో మనోజ్ ఒక్కసారిగా షాకయ్యాడు. తర్వాత ఆమెను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే కుమారి నుంచి మనోజ్‌కు ఓ సందేశం అందించింది. అందులో.. ‘కొంత మొత్తంలో డబ్బులి. ఇవ్వకుంటే నీపై రేప్ కేసు పెడతా. మీ కుటుంబ సభ్యుల మీద కూడా ఫిర్యాదు చేస్తా’ అని ఉండటాన్ని చూసి మనోజ్ కంగుతిన్నాడు. భయాందోళనకు గురై, అడిగిన మొత్తాన్ని కుమారికి ఇచ్చేశాడు. 



ఆ తర్వాత కూడా చాలా సార్లు మనోజ్‌ను కుమారి బెదిరించి డబ్బులు తీసుకుంది. ఈ క్రమంలోనే కుమారి వైఖరి చూసి విసిగిపోయిన మనోజ్ తాజాగా దారుణానికి పాల్పడ్డాడు. గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు మనోజ్ సూసైడ్‌ నోట్‌ను వాట్సప్‌లో రాసి తన సోదరిడితోపాటు, కుమారికి కూడా పంపించాడు. అందులో.. కుమారి కోసం ఇక తాను అప్పులు చేయలేనంటూ నిస్సాహయతను వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు రూ. 2లక్షలు ఇచ్చినట్టు పేర్కొన్నాడు. బైక్, మొబైల్ కూడా అమ్మేసినట్టు తెలిపాడు. చివరికి చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వెల్లడించాడు. కాగా.. మనోజ్ మృతదేహాన్ని రైల్వే పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  




Updated Date - 2022-02-12T20:41:20+05:30 IST