Advertisement

ఖమ్మంలో 251,వరంగల్‌లో 502 మంది

Apr 23 2021 @ 02:24AM

బ్యాలెట్‌ పోరుకు అభ్యర్థులు ఖరారు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 30న జరగనున్న మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారైంది. వరంగల్‌ లోని 66 వార్డులకు 434 మంది పోటీ పడుతుండగా, ఖమ్మంలోని 60 వార్డులకు 251 మంది పోటీలో ఉన్నారు. అచ్చంపేటలోని 20 వార్డులకు 66, సిద్ధిపేటలోని 43 వార్డులకు 236 మంది పోటీలో ఉన్నారు. నకిరేకల్‌లోని 20 వార్డులకు 93, జడ్చర్లలోని 27 వార్డులకు 112, కొత్తూరులోని 12 వార్డులకు 49 మంది పోటీలో ఉన్నారు. మొత్తంగా సాధారణ ఎన్నికలు జరుగుతున్న ఏడు మునిసిపాలిటీల పరిధిలోని 248 వార్డులకు మొత్తం 1241 మంది పోటీలో ఉన్నారు. కాగా పలు మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న 9 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా అందులో జల్‌పల్లి, ఆలపూర్‌, మెట్‌పల్లి, బెల్లంపల్లిలో... నాలుగు చోట్ల ఒకొక్కరే పోటీలో మిగలడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.