ltrScrptTheme3

కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ జంటను ఇంటికి ఆహ్వానించాడా వ్యక్తి.. ప్రేమతో పిలిచాడు కదా అని వెళ్లిన ఆ నవ దంపతులకు..

Sep 23 2021 @ 11:28AM

కొత్తగా పెళ్లి చేసుకున్న సోదరుడిని, అతడి భార్యను తన ఇంటికి ఆహ్వానించాడు.. పురాతన గుడి చూపిస్తాననే నెపంతో సోదరుడి భార్యను బయటకు తీసుకెళ్లాడు.. అక్కడ తనతో శృంగారం సాగించమని ఆమెను బలవంతం చేశాడు.. అందుకు ఆమె తిరస్కరిచండంతో తన స్నేహితుడితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. అనంతరం ఆమెను హత్య చేసి కొండ లోయలోకి తోసేశాడు.. ఆమె భర్త ఫిర్యాదుతో అసలు విషయం వెలుగు చూసింది.. మహారాష్ట్రలోని పింప్రి-చించివాడ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


కొత్తగా పెళ్లి చేసుకున్న తన కజిన్ బ్రదర్ కుటుంబాన్ని పింప్రి-చించివాడ్ ప్రాంతంలో ఉంటున్న 25 ఏళ్ల వ్యక్తి తన ఇంటికి ఆహ్వానించాడు. బుధవారం అక్కడకు వచ్చిన కొత్త జంట భోజనం చేసింది. తర్వాత భార్యను అక్కడే వదిలి భర్త వేరే పని మీద బయటకు వెళ్లాడు. సమీపంలో ఉన్న పురాతన దేవాలయాన్ని చూపిస్తానని చెప్పి తన సోదరుడి భార్య (19)ను 25 ఏళ్ల వ్యక్తి బయటకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె దగ్గర తన కోరికను వెళ్లబుచ్చాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో అక్కడే తన స్నేహితుడితో కలిసి నిందితుడు ఆమెపై అత్యాచారానికి తెగించాడు. ఇద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 


ఇవి కూడా చదవండి

ప్రేమజంటకు సహకరించిందని దారుణం.. చితక్కొట్టి, యాసిడ్ పోసి..



నైట్‌షిఫ్ట్ తర్వాత క్యాబ్ ఎక్కింది.. అదే ఆమె పాలిట శాపంగా మారింది..

అనంతరం చున్నీతో ఉరేసి ఆమెను చంపేశారు. ఆమె గురించి ఎవరికీ తెలియకుండా ఆమె మొహంపై రాయితో కొట్టారు. అనంతరం పొదల్లో ఆమె మృతదేహాన్ని పడేశారు. తన భార్య ఇంట్లో లేకపోవడంతో భర్త ఆమె గురించి వెతికాడు. ఎంతకీ ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికులను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడితో కలిసి యువతి బయటకు వెళ్లినట్టు స్థానికులు చెప్పారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి స్నేహితుడి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. 


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.