రోడ్డుపై మాట్లాడుకుంటూ వెళ్తున్న 20 ఏళ్ల యువతి, 25 ఏళ్ల కుర్రాడు.. ప్రేమికులేమో అని ఎవరూ పట్టించుకోలేదు.. కానీ ఇంతలోనే..

Sep 24 2021 @ 14:08PM

చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్‌కు సమీపంలోని బిజీ రోడ్డు.. గురువారం మధ్యాహ్నం 20 ఏళ్ల యువతి, 25 ఏళ్ల కుర్రాడు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.. ప్రేమికులేమో అని ఎవరూ పట్టించుకోలేదు.. అంతలోనే వారి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది.. దీంతో యువకుడు తన జేబులో ఉన్న కత్తి తీసి ఆమె గొంతులో గుచ్చాడు.. అనంతరం తను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.. ఆ హఠాత్పరిణామాన్ని చూసిన స్థానికులు ఆ యువకుడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. 


తమిళనాడులోని నాగపట్టణం జిల్లాకు చెందిన రామచంద్రన్ అనే యువకుడు చెన్నైలో కార్ల తయారీ సంస్థలో పని చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం అతడికి చెన్నైలోని క్రోమ్‌పేట్‌లో నివసిస్తున్న యువతి పరిచయమైంది. నగరంలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్‌లో డీఎమ్‌ఎల్‌టీ చదువుతున్న 20 ఏళ్ల యువతికి రామచంద్రన్ గురువారం ఉదయం ఫోన్ చేసి తాంబర్ రైల్వే స్టేషన్ దగ్గరకు రమ్మని పిలిచాడు. అక్కడికి వచ్చి అతడితో ఆమె మాట్లాడింది. అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. 


ఇవి కూడా చదవండి

విడాకుల మహోత్సవం.. స్వేచ్ఛ అంటూ సెలబ్రేట్ చేసుకున్న మహిళ..



పెళ్లికి జాతకాలు కుదర్లేదన్నాడు.. షాకిచ్చిన హైకోర్టు..

వాదన మరింత పెరిగిన తర్వాత రామచంద్రన్ తన జేబులో ఉన్న కత్తి తీసి యువతి గొంతులోకి దింపాడు. దీంతో యువతి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అనంతరం రామచంద్రన్ తన గొంతు కోసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు రామచంద్రన్ ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. బాధిత యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రామచంద్రన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసినపుడు గాయాలు కావడంతో అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.