26రోజులు.. 2,713 కిలోమీటర్లు

ABN , First Publish Date - 2022-07-07T05:55:19+05:30 IST

జాతీయ సమైఖ్యత కాంక్షిస్తూ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన బాలుడు మాచర్ల వెంకటేశ్‌(17) కేవలం 26రోజుల్లో హైదరాబాద్‌ నుంచి జమ్మూకశ్మీర్‌లోని లేహ్‌కు చేరుకున్నాడు.

26రోజులు.. 2,713 కిలోమీటర్లు
లేహ్‌ చేరుకున్న మాచర్లవెంకటేశ్‌

హైదరాబాద్‌ నుంచి లేహ్‌కు సైకిల్‌పై చేరుకున్న పటాన్‌చెరు  బాలుడు

అభినందించిన హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

పటాన్‌చెరు, జూలై 6: జాతీయ సమైఖ్యత కాంక్షిస్తూ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన   బాలుడు మాచర్ల వెంకటేశ్‌(17) కేవలం 26రోజుల్లో హైదరాబాద్‌ నుంచి జమ్మూకశ్మీర్‌లోని లేహ్‌కు చేరుకున్నాడు. మే 23న హైదరాబాద్‌ నుంచి ప్రారంభమైన సైకిల్‌యాత్ర జూన్‌ 17న లేహ్‌కు చేరుకోవడంతో విజయవంతమైంది. మార్గమధ్యంలో 11 రాష్ట్రాలను దాటేసి 2,713కిలోమీటర్ల సైకిల్‌యాత్రను ఒంటరిగా పూర్తి చేసి భళా అనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న హర్యానా గవర్నర్‌ బండారుదత్తాత్రేయ వెంకటేశ్‌ సాహసాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. ఈ మేరకు బుధవారం హర్యానా రాజ్‌భవన్‌ నుంచి ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేశ్‌ ఈ తరహా యాత్రను పూర్తి చేయడం అభినంధనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వెంకటేశ్‌ను గవర్నర్‌ బండారుదత్తాత్రేయ ప్రత్యేకంగా అభినందించారు. 

Updated Date - 2022-07-07T05:55:19+05:30 IST