గణతంత్ర వేడుకలకు గిరిజన మహిళ

ABN , First Publish Date - 2021-01-24T05:12:55+05:30 IST

గణతంత్ర వేడుకలకు గిరిజన మహిళ

గణతంత్ర వేడుకలకు గిరిజన మహిళ
ఢిల్లీ గణతంత్ర వేడుకలకు హాజరవుతున్న భూక్య లక్ష్మి (ఫైల్‌)

 గణతంత్ర వేడుకలకు గిరిజన మహిళ

బంజార గిరిజన సంస్కృతి పరేడ్‌లో లక్ష్మికి అవకాశం

మహబూబాబాద్‌ రూరల్‌, జనవరి 23 : న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈనెల 26న నిర్వహించనున్న భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు మహబూబాబాద్‌ జిల్లాలోని మారుమూల గడ్డిగూడెంవాసి భూక్య లక్ష్మికి అవకాశం లభించింది. వేడుకల నిర్వహణలో వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబిస్తూ కొనసాగే పరేడ్‌లో గిరిజన బంజార సంస్కృతి విభాగంలో భూక్య లక్ష్మి పాల్గొంటోంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారులు తెలిపారు.

మహబూబాబాద్‌ మండలం గడ్డిగూడెం గ్రామపంచాయతీకి చెందిన గిరిజన బంజార రైతు భూక్య లక్ష్మి తనకున్న రెండెకరాల చెలకలో మిర్చి, కందులు సాగు చేసుకుంటోంది. అదే గ్రామపంచాయతీలో చిరుద్యోగిగా పనిచేస్తున్న తన భర్త భూక్య విష్ణుకు చేదో డు వాదోడుగా నిలుస్తోంది. దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె కల్యాణి ఈఎన్‌టీ పూర్తి చేసింది. కుమారుడు గణేష్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. 

Updated Date - 2021-01-24T05:12:55+05:30 IST