27 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

ABN , First Publish Date - 2022-05-22T05:17:22+05:30 IST

ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి వారి నుండి 27ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

27 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
రికవరీ అయిన వాహనాలను పరిశీలిస్తున్న ఎస్పీ కే.మనోహర్‌


మన్ననూర్‌, మే 21: ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి వారి నుండి 27ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎస్పీ కే.మనోహర్‌, అచ్చంపేట డీఎస్పీ కృష్ణకిశోర్‌లు అమ్రాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కే.మనోహర్‌ మాట్లాడుతూ ఈనెల 18న తన ద్విచక్ర వాహనం చోరీకి గురైందని ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల ద్వారా నిఘా వేయడంతో అమ్రాబాద్‌ మండలం మాధవానిపల్లి గ్రామానికి చెందిన ఎలిశెట్టి సత్యనారాయణ, ఎలిమలపల్లి గ్రామానికి చెందిన చారగొండ మహేష్‌లు చోరీకి పాల్పడినట్లు బయటపడిందని అన్నారు. వీరిద్దరూ నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన 12ద్విచక్ర వాహనాలు, నల్లగొండ 12, రాచకొండ 6, మహబూబ్‌నగర్‌ 3, సైబరాబాద్‌ 1, హైదరాబాద్‌ 4, వాహనాలను చోరీ చేశారని తెలిపారు. ప్రస్తుతం వీరిచ్చిన సమాచారం మేరకు 27వాహనాలను స్వాధీనం చేసుకున్నా మని, మరో 17వాహనాలను త్వరలోనే రికవరీ చేయనున్నట్లు వెల్లడిం చారు. నిందితులు ఇద్దరికీ ఇదే మండలంలో కల్మోనిపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ, ఎలిమపల్లి గ్రామానికి చెందిన అంజి, కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్‌లు సహకరించారని వీరిపైన కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సత్యనారాయణ గతంలో కూడా ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడి సంవత్సరంన్నర జైలు శిక్ష కూడా అను భవించాడని తిరిగి చోరీకి పాల్పడడంతో అతనిపై పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. అమ్రాబాద్‌ సీఐ ఆదిరెడ్డి పర్య వేక్షణలో ఎస్సైలు సద్దాంహుస్సేన్‌, తిరుపతిరెడ్డిలు కేసును చాకచక్యంగా చేధించడంపై ఆయన అభినందించారు. వీరికి త్వరలోనే రివార్డు ఇవ్వను న్నట్లు ఎస్పీ వెల్లడించారు. అదేవిధంగా, నకిలీ విత్తనాలను విక్రయించే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-05-22T05:17:22+05:30 IST