18ఏళ్ల టీనేజర్‌కు స్వాగతం పలికిన 27 యూనివర్సిటీలు.. రూ.30కోట్ల స్కాలర్‌షిప్ కూడా..

ABN , First Publish Date - 2022-04-14T01:58:28+05:30 IST

ప్రస్తుత పోటీ ప్రపంచంలో కోరుకున్న కాలేజీలో సీటు రావడం అంటే చిన్న విషయం కాదు. తీవ్రంగా శ్రమించినప్పటికీ కొందరికే మాత్రమే ఆ అవకాశం దక్కుంది. అటువంటి ఇష్టపడ్డ కాలేజీల్లోన్నింటిలో

18ఏళ్ల టీనేజర్‌కు స్వాగతం పలికిన 27 యూనివర్సిటీలు.. రూ.30కోట్ల స్కాలర్‌షిప్ కూడా..

ఎన్నారై డెస్క్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో కోరుకున్న కాలేజీలో సీటు రావడం అంటే చిన్న విషయం కాదు. తీవ్రంగా శ్రమించినప్పటికీ కొందరికే మాత్రమే ఆ అవకాశం దక్కుంది. అటువంటి ఇష్టపడ్డ కాలేజీల్లోన్నింటిలో సీటు లభిస్తే.. అదనంగా ఆ కాలేజీలు లేదా యూనివర్సిటీలు స్కాలర్‌షిప్‌లను కూడా ఆఫర్ చేస్తే ఎలా ఉంటుంది. భూమ్మీద అస్సలు కాళ్లు నిలపకుండా ఎగిరి గంతేస్తారు కదూ.. అచ్చం ఇటువంటి అనుభూతినే ప్రస్తుతం అమెరికాకు టీనేజర్ పొందుతున్నాడు. కాగా.. అతడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఫ్లోరిడాకు చెందిన 18ఏళ్ల జోనాథన్ వాకర్ ఉన్నత చదువుల కోసం తాజాగా 27 విద్యా సంస్థల్లో ప్రవేశానికి (కాలేజీలు, యూనివర్సిటీలు) దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో అన్ని విద్యా సంస్థలూ అతడి దరఖాస్తులకు ఆమోదముద్ర వేశాయి. అంతేకాకుండా సుమారు 4మిలియన్ల (దాదాపు రూ.30కోట్ల) స్కాలర్‌షిప్‌ను కూడా ఆఫర్ చేశాయి. అతడికి వెల్కమ్ పలికిన యాలే, హార్వర్డ్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా తదితర విద్యా సంస్థలు ఉన్నాయి. దీనిపై స్పందించిన జోనాథన్ వాకర్ సంతోషం వ్యక్తం చేశాడు. తన కుటుంబ సభ్యలు తోడ్పాటు వల్లే ఇది సాధ్యమైందని తెలిపాడు. రూథర్‌ఫర్డ్ ఫర్డ్ హైస్కూల్‌లో విద్యాభ్యాసం చేసిన ఈ టీనేజర్.. చిన్నప్పటి నుంచి చదువులోనే కాకుండా ఆటల్లోనూ ముందుండే వాడు. కాగా.. ఈ వార్త ప్రస్తుతం అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. 




Updated Date - 2022-04-14T01:58:28+05:30 IST