ఉమ్మడి జిల్లాలో 277 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-09-22T06:58:57+05:30 IST

ఉమ్మడి జిల్లాలో సోమవారం 277 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఇద్దరు మృతిచెందారు.

ఉమ్మడి జిల్లాలో 277 పాజిటివ్‌ కేసులు

సిద్దిపేట జిల్లా ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ఒకరు, మెదక్‌లో మరొకరు మృతి


సిద్దిపేట/సంగారెడ్డి అర్బన్‌/మెదక్‌ అర్బన్‌, సెప్టెంబరు 21 : ఉమ్మడి జిల్లాలో సోమవారం 277 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఇద్దరు మృతిచెందారు. సిద్దిపేట జిల్లాలో 197 మందికి పాజిటివ్‌గా తేలగా తొగుట మండలంలో ఒకరు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లాలో 54 మందికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. మెదక్‌ జిల్లాలో 26 మందికి పాజిటివ్‌గా నమోదవగా, మెదక్‌ పట్టణానికి చెందిన ఒకరు మృతిచెందారు. సిద్దిపేట జిల్లాలో నమోదైన 197 పాజిటివ్‌ కేసుల్లో సిద్దిపేట డివిజన్‌లో 114, గజ్వేల్‌ డివిజన్‌లో 47, హుస్నాబాద్‌ డివిజన్‌లో 36 కేసుల చొప్పున నమోదయ్యాయి.


తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన ఒకరు మృతి చెందారు. సిద్దిపేట డివిజన్‌లోని సిద్దిపేటలో గొంతుస్రావాల పరీక్షల ద్వారా 21, చేర్యాల సీహెచ్‌సీలో 4, పీహెచ్‌సీల వారీగా చిన్నకోడూరులో 7, ఇబ్రహింనగర్‌లో 4, దౌల్తాబాద్‌లో 1, ఇందుప్రియాల్‌లో 2, దుబ్బాక సీహెచ్‌సీలో 5, రామక్కపేటలో 1, తిమ్మాపూర్‌లో 5, కొమురవెల్లిలో 5, మిరుదొడ్డిలో నిల్‌, భూంపల్లిలో 5, రాజగోపాల్‌పేటలో 2, నంగునూరులో 3, నారాయణరావుపేటలో 12, పుల్లూరులో 11, సిద్దిపేటలోని నాసర్‌పుర యూపీహెచ్‌సీలో 12, అంబేద్కర్‌నగర్‌ యూపీహెచ్‌సీలో 9, తొగుటలో 5 కేసులు నమోదయ్యాయి. గజ్వేల్‌ డివిజన్‌లోని గజ్వేల్‌ ఆస్పత్రిలో 4, పీహెచ్‌సీల వారీగా అహ్మదీపూర్‌లో 4, సిరిగిరిపల్లిలో 3, జగదేవ్‌పూర్‌లో 4, తిగుల్‌లలో 2, కొండపాకలో 5, కుకునూరుపల్లిలో 5, మరుకుక్‌లో 5, ములుగులో 3, సింగన్నగూడెంలో 2, రాయపోల్‌లో 6, వర్గల్‌లో 4  కేసులు నమోదయ్యాయి. హుస్నాబాద్‌ డివిజన్‌లో పీహెచ్‌సీల వారీగా అక్కన్నపేటలో 4, బెజ్జంకిలో 13, తోటపల్లిలో 1, హుస్నాబాద్‌లో 8, కోహెడలో 5, లద్నూర్‌లో 2, మద్దూరులో3 కేసులు వెలుగుచూశాయి. 


సంగారెడ్డి జిల్లాలో సోమవారం 54 మందికి కరోనా నిర్ధారణ అయిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌ తెలిపారు. సంగారెడ్డిలో-20, జహీరాబాద్‌-3, అమీన్‌పూర్‌-3, పటాన్‌చెరు-3, ఆర్‌సీపురం-2, దౌల్తాబాద్‌-1, చెర్లగోపులారం-1, మల్కాపూర్‌-3, మల్లేపల్లి-1, వాసర్‌-2, కంది-6, వడెన్నతాండ-1, మామిడిపల్లి-3, చిట్కుల్‌, మొగుడంపల్లి, ఇస్మాయిల్‌ఖాన్‌పేట్‌, సత్వార్‌, సింగూర్‌లలో ఒక్కొక్కరికి కరోనా నిర్ధారణ అయినదని వెల్లడించారు. పాజిటివ్‌ వచ్చిన 54 మందిలో 52 మంది హోంఐసోలేషన్‌, ఇద్దరు ప్రభుత్వాస్పత్రిలో ఉన్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,379 మందికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేసినట్లు వెల్లడించారు. సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి నుంచి 206 మంది, పటాన్‌చెరు నుంచి 147 మంది శాంపిళ్లు సేకరించి కొవిడ్‌ నిర్ధారణ కోసం గాంధీకి పంపామని డీఎంహెచ్‌వో తెలిపారు. 


మెదక్‌ జిల్లాలో సోమవారం 26 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 3096కి పెరిగిపోయింది. జిల్లా కేంద్రంలోని పెద్దబజార్‌కు చెందని 70 ఏళ్ల కిరాణా వ్యాపారి మృతి చెందారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి 38 మందిని బలితీసుకుంది. తాజాగా కేసులను పరిశీలిస్తే... మెదక్‌టౌన్‌ 8, నిజాంపేట్‌ 5, రామాయంపేట 4, తూప్రాన్‌ 2, హావేళిఘణపూర్‌ 2, నర్సాపూర్‌, మనోహరబాద్‌, చేగుంట, కౌడిపల్లి, వెల్దుర్తి మండలాల్లో ఒకటి చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

Updated Date - 2020-09-22T06:58:57+05:30 IST